Movies25 ఏళ్ల ' ఎన్టీఆర్ బాల రామాయ‌ణం ' గురించి ఈ...

25 ఏళ్ల ‘ ఎన్టీఆర్ బాల రామాయ‌ణం ‘ గురించి ఈ ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు మీకు తెలుసా…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీలో ఓ సంచ‌ల‌నం. ఎన్టీఆర్ 2000లో వ‌చ్చిన నిన్ను చూడాల‌ని సినిమాతో వెండితెర‌కు హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ఈ 22 ఏళ్ల‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల్లో న‌టించాడు. ఈ త‌రం హీరోల‌కు సాధ్యం కాని విధంగా తాజాగా వ‌చ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్లు కొట్టారు. కేవ‌లం సాంఘీక క‌థ‌ల‌తో మాత్ర‌మే కాకుండా య‌మ‌దొంగ‌లో యంగ్ య‌ముడిగా, జై ల‌వ‌కుశ‌లో రావ‌ణుడిగా న‌టించి అద‌ర‌గొట్టేశాడు.

అయితే ఎన్టీఆర్ హీరో అవ్వ‌డానికి ముందే చిన్న‌ప్పుడే బాల రామ‌య‌ణం సినిమాలో న‌టించి అద‌ర‌గొట్టేశాడు. అప్పుడు ఎన్టీఆర్ న‌ట‌న చూసిన వాళ్లే ఎన్టీఆర్ పౌరాణిక పాత్ర‌ల్లో కూడా తాత‌, బాబాయ్‌కు త‌గ్గ వార‌సుడు అనిపించుకుంటాడ‌ని అంద‌రూ భావించారు. ఆ త‌ర్వాత ఆ పాత్ర‌లు చేసి తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు కూడా..! ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ హీరో కాక‌ముందే బాల రామాయ‌ణం సినిమాలో రాముడి పాత్ర‌లో న‌టించారు.

అప్ప‌ట్లోనే ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యి 100 రోజులు ఆడింది. ఈ సినిమా విడుద‌లై నేటితో 25 ఏళ్లు అవుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ చిన్న పిల్ల‌ల‌తో ఈ ఇతిహాస‌న్ని చాలా బ్యూటిఫుల్‌గా ప్ర‌జెంట్ చేశాడ‌నే చెప్పాలి. నిర్మాత ఎంఎస్‌. రెడ్డి నిర్మాణ విలువ‌లు కూడా ఈ సినిమాను మ‌రో రేంజ్‌లో నిల‌బెట్టాయి.

ఎన్టీఆర్ రాముడిగా న‌టించ‌గా… స్మితా మాధ‌వ్ సీత‌గా న‌టించారు. స్వాతి బాలినేని రావ‌ణుడిగా న‌టించ‌గా… నారాయ‌ణం నిఖిల్ ల‌క్ష్మ‌ణుడిగా క‌నిపించారు. శ్వేతారావు ఊర్మిళ‌గా, వ‌సుంధ‌ర ఎస్‌. రంగ‌న్ కైకేయిగా, చిరంజీవి స‌మ్మెట భ‌ర‌తుడిగా, శ‌బ‌రిగా సున‌య‌న న‌టించారు. ఈ సినిమా అప్ప‌ట్లో ప‌లు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సంగీతం మాధ‌వ‌పెద్ది సురేష్, వైద్య‌నాథ‌న్ అందించారు.

ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా గురించి మొద‌ట ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ మ‌వ‌న‌డు అట‌.. అచ్చు గుద్దిన‌ట్టు ఎన్టీఆర్‌లా ఉన్నాడు.. రాముడిగా బాగా చేశాడ‌ట అన్న టాక్ రావ‌డంతో నెమ్మ‌దిగా థియేట‌ర్ల‌కు జ‌నాలు రావ‌డం స్టార్ట్ చేశారు. అస‌లు ఫ‌స్ట్ వ‌న్ వీక్ జ‌నాల‌కు పెద్ద‌గా ఎక్క‌లేదు. ఎప్పుడు అయితే చిన్న పిల్ల‌ల రామాయ‌ణం బాగుంద‌న్న టాక్ రావ‌డం.. ఎన్టీఆర్ మ‌వ‌న‌డు.. ఆయ‌న‌లానే ఉన్నాడ‌న్న ప్ర‌చారంతో ఊరూ వాడా త‌ర‌లి వ‌చ్చి ఈ సినిమాను చూడ‌డం స్టార్ట్ చేశారు.

అలా ఈ సినిమా 100 రోజులు ఆడింది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఎప్ప‌ట‌కీ చ‌రిత్ర‌లో చెక్కు చెద‌ర‌ని మ‌ధురానుభూతులు మిగిల్చింది. 1998లో భార‌తీయ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాల్లో ఉత్త‌మ బాల‌ల సినిమాగా ఎంపికైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news