Moviesమరోచరిత్ర హీరోయిన్ సరిత కూతురు కూడా హీరోయినే... మీకు తెలుసా..!

మరోచరిత్ర హీరోయిన్ సరిత కూతురు కూడా హీరోయినే… మీకు తెలుసా..!

హీరోయిన్ సరిత.. నేటి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు గానీ నిన్నటితరం తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగా తెలిసిన హీరోయిన్. మరో చరిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ గా మొదటి సినిమాతోనే హిస్టరీ క్రియేట్ చేసింది. బాలచందర్ తెలుగులో దర్శకత్వం వహించిన మరో చరిత్ర సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఒక్క సినిమాతో స‌రిత ఫేట్‌ మారిపోయింది. ఈ సినిమాలో తన అందం అభినయంతో ఆకట్టుకున్న సరిత మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించింది సరిత. అయితే కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాదు డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా తెలుగు ప్రేక్షకులను అలరించింది. సరిత మధురమైన గానం తెలుగు ప్రేక్షకులందరినీ కట్టిపడేసింది. తర్వాత ఎంతోమంది హీరోయిన్లకు గాత్ర దానం చేసింది. సరిత తెలుగులో కంటే తమిళంలోనే బాగా పాపులర్ అయింది. అక్కడ స్టార్ హీరోలందరితో నటించింది. ఒకరు ఇండస్ట్రీలోకి వచ్చి సెటిల్ అయ్యారు అంటే వారి ఫ్యామిలీ నుంచి మరికొంత మంది కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తూ ఉంటాం.

సరిత హీరోయిన్‌ అయిన తర్వాత సరిత చెల్లెలు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిందట. ఆ చెల్లి వెండితెరపై కాకుండా బుల్లితెరతోనే సరిపెట్టుకుంది. ఆమె పేరే విద్య రామచంద్రన్. ఈమె కూడా తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఏకంగా సీరియల్ లో హీరోయిన్ స్థాయి వరకు తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే విద్య రామ చంద్రన్ కు ఒక కూతురు ఉంది.

ఆమె పేరు లవ్లీన్ అందరి వారసులు లాగానే తను కూడా సినిమాల్లోకి వచ్చి రాణించాలి అనుకుంటోంది. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్న లవ్లీన్ ఇక ఇప్పుడు ఎంతో స్టైల్ గా కనిపిస్తోంది. ఇక ఈ అమ్మడు చేసిన మొదటి సినిమానే కాస్త డిఫరెంట్ అని చెప్పాలి. హౌస్ ఓనర్ అనే సినిమాలో నటించింది. మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది లవ్లీన్. మరి ఈ హీరోయిన్ కెరియర్ ఎలా సాగుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news