Moviesఒకప్పటి టాప్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లి ఆత్మ‌హ‌త్య‌కు అత‌డే కార‌ణ‌మా...!

ఒకప్పటి టాప్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లి ఆత్మ‌హ‌త్య‌కు అత‌డే కార‌ణ‌మా…!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకరు వచ్చి స్టార్ గా కొనసాగుతూ ఉంటే.. ఇక ఆ ప్రభావం వారి కుటుంబ సభ్యులపై కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఇలా మంచి స్టార్ డమ్ సంపాదించుకున్న నటీనటుల కుటుంబాల నుంచి ఎంతోమంది సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఇలా ఎంట్రీ ఇచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇలా వచ్చిన వారిలో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం సక్సెస్ అవ్వలేక చిత్రపరిశ్రమలో కనుమరుగైపోతూ ఉంటారు.

ఇలాంటి వారిలో సిమ్రాన్ చెల్లెళ్లు కూడా ఉన్నారు అని తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో సిమ్రాన్ నడిపించిన హవా అంతా ఇంతా కాదు. గ్లామర్ పాత్రలతో అందరిని పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ. ఇటు టాలీవుడ్‌తో అటు కోలీవుడ్‌లోనూ ప‌దేళ్ల పాటు స్టార్ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ ఏలేసింది. తన ఒంపుసొంపులతో అభిమానులందరినీ కూడా పగటి కలల్లోకే నెట్టింది. సిమ్రాన్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సిమ్రాన్ ఇద్దరు చెల్లెళ్లు కూడా సినిమాల్లోకి రావాలని అనుకున్నారట.

సిమ్రాన్ పెద్ద చెల్లి జ్యోతి నటిగా పరిచయం అయినా పెద్దగా ప్రేక్షకాదరణ పొంద‌క‌ముందే కనుమరుగయ్యింది. చిన్న తల్లి మోనాలి మాత్రం అక్క లాగా పెద్ద హీరోయిన్ అవ్వాలని ఎంతగానో కష్టపడింది. ఇక నటిగా మారకముందే ఎన్నో యాడ్ ఫిలిమ్స్ లో నటించిన మోనాలి ఆ తర్వాత అక్క సపోర్ట్ చేస్తుంది అనే నమ్మకంతో ఇండస్డ్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు అరడజను పైగానే సినిమాల్లో నటించింది మోనాలి. ఆ తర్వాత మాత్రం అవకాశాలు రాలేదు. సిమ్రాన్ కొంత మంది దర్శకులకు తన చెల్లిని రిఫర్ చేసినా వ్యక్తిగత కారణాల వల్ల కెరియర్ నిలబెట్టుకోలేకపోయింది.

తన సినిమాకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ప్రసన్న సుజిత్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఏమైందో చివరికి ఆత్మహత్య చేసుకుంది మోనాలి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయని చెబుతారు. ప్రేమ గీమ పక్కనపెట్టి అక్క లాగా కెరీర్‌పై దృష్టి పెట్టాలని తల్లి ఒత్తిడి తీసుకు రావడంతోనే ఆత్మహత్య చేసుకుందని కొంతమంది.. ఎంతగానో ప్రేమించిన ప్రసన్న సుజిత్ వాడుకొని వదిలేయడం కారణంగానే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని మరికొంతమంది అంటు ఉంటారు. అప్పట్లో మోనాలి ఆత్మహత్య ఇండస్ట్రీలో సంచలనంగా మారింది..

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news