Moviesఅలా హ్యాండ్ ఇచ్చాడు... త‌న ల‌వ్‌స్టోరీ బ్రేక‌ప్ గుట్టు విప్పిన అషురెడ్డి...!

అలా హ్యాండ్ ఇచ్చాడు… త‌న ల‌వ్‌స్టోరీ బ్రేక‌ప్ గుట్టు విప్పిన అషురెడ్డి…!

తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు బిగ్ బాస్ ఫేం అషు రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అషు రెడ్డిని మ‌న బుల్లితెర అభిమానులు అంద‌రూ ముద్దుగా జూనియ‌ర్ స‌మంత అని పిలుచు కుంటూ ఉంటారు. నిజంగానే ఓ యాంగిల్లో చూస్తే ఆమెలో స‌మంత క‌ట్స్ కొన్ని మ‌న‌కు క‌న‌ప‌డ‌తాయి. సోష‌ల్ మీడియాలో డ‌బ్‌స్మాష్ వీడియోలు చేస్తూ ల‌క్ష‌లాది ఫాలోవ‌ర్స్‌ను అషు సొంతం చేసుకుంది. ఆ క్రేజ్‌తోనే ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాక కూడా అషు హౌస్‌లో చేసిన హంగామా అంతా ఇందా కాదు. ఇక్క‌డ కూడా త‌న బిహేవియ‌ర్‌తో ఆమె బుల్లితెర అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైపోయింది. వైజాగ్ అమ్మాయి చేసిన అల్ల‌రి అంతా ఇంతా కాదు.. నాగ్ సైతం ఆమెను ఎన్నోసార్లు మెచ్చుకున్నాడు. హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఆమెను బోల్డ్ ఇంట‌ర్వ్యూ చేయ‌డంతో అషుకు హీరోయిన్ల‌ను మించిన పాపులారిటీ సొంత‌మైంది.

అషు నిత్యం సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారును హీటెక్కించేస్తూ ఆమె బాగా హంగామా చేస్తూనే ఉంటుంది. తాజాగా అషు బిగ్‌బాస్ ఓటీటీలో కూడా ఉంది. ఈ షోలో కంటెస్టెంట్ల‌కు త‌లుపు త‌ట్టిన ప్రేమ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో ప్ర‌తి ఒక్క కంటెస్టెంట్ త‌న తొలి ప్రేమ గురించి చెప్పాలి. ఈ క్ర‌మంలోనే అషు రెడ్డి కూడా త‌న మొద‌టి ప్రేమ గురించి చెప్పింది.

త‌న‌కు 20 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడే తాను ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని.. తాను క‌నిపించిన వెంట‌నే అత‌డు నా నుదుటిపై ముద్దులు పెట్టేవాడ‌ని.. చాలా క్యూట్‌గా ఉండేవాడ‌ని.. మా ప్రేమ క‌థ అంతా చాలా బాగా న‌డిచింద‌ని అప్ప‌టి స్మృతులు అషు రెడ్డి గుర్తు చేసుకుంది. తాము ఎప్ప‌టిక‌ప్పుడు క‌లుసుకుని క‌బుర్లు చెప్పుకుంటూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ల‌మ‌ని.. త‌న చిలిపి ప్రేమ సంగ‌తులు అన్ని తాను త‌న ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకునే దానిని అని అషు చెప్పింది.

అయితే ఈ ప్రేమ గురించి త‌న ఇంట్లో వాళ్ల‌కు తెలియ‌డంతో త‌న‌ను కుటుంబ స‌భ్యులు చాలా రోజుల పాటు హౌస్ అరెస్టు చేశార‌ని.. చివ‌ర‌కు మా ఇంట్లో వాళ్లు న‌న్ను యూఎస్ పంపి ఎంబీయే చేసుకుర‌మ్మ‌ని చెప్పార‌ని… ఈ విష‌యం త‌న ప్రేమికుడితో చెపితే అత‌డు కూడా వ‌స్తాన‌న్నాడ‌ని.. తీరా త‌న‌ను ఫ్లైట్ ఎక్కించి.. అత‌డు మాత్రం ఇక్క‌డే ఉండిపోయాడ‌ని ఎమోష‌న‌ల్ అయిపోయింది. ఇక తాను ఎంబీయే పూర్తి చేసుకుని వ‌చ్చాక ఇంట్లో వాళ్లు మా ఇద్ద‌రి పెళ్లికి ఒప్పుకున్నా కూడా.. అత‌డిలో మార్పు రావ‌డంతో తాను బ్రేక‌ప్ చెప్పేశాన‌ని.. ఆ బాధ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు చాలా రోజులు టైం ప‌ట్టింద‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news