Moviesఆచార్య ఫస్ట్ డే కలెక్షన్స్..ఫ్యాన్స్ దిమ్మ తిరిగిపోవాల్సిందే ..!!

ఆచార్య ఫస్ట్ డే కలెక్షన్స్..ఫ్యాన్స్ దిమ్మ తిరిగిపోవాల్సిందే ..!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. ఎన్నో భారీ అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు మూడేళ్ళు గా ఊరించి ఊరించి..నాలుగు సార్లు బ్రేకులు వేసుకుంటూ..ఫైనల్ గా ధియెటర్స్ లోకి వచ్చింది ‘ఆచార్య’. అయితే ఎవ్వరు ఊహించని విధయంగా సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆచార్య లో చిరు, చరణ్‌లు తొలిసారిగా పూర్తిసాయిలో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటుండడంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా అపజయం ఎరుగని డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించదంతో.. ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ కు వెళ్లిపోయాయి.

కానీ, అభిమానుల ఆశలను నిరాశపరిచాడు కొరటాల. సినిమా ఊహించినంత హిట్ అందుకోలేకపోయింది. దీంతో కొరటాల మొదటి ఫ్లాప్ ను రుచి చూశాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే ఉంది అనగానే జనాలు ఓ రేంజ్ లో ఊహించుకున్నారు..కానీ కొరటాల పూజా ని వాదుకోవదంలో ఫ్లాప్ అయ్యాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు అనిపించినా..పాటలు కూడా అకట్టుకోలేకపోయాయి. ఇన్ని డిజాస్టర్ల మధ్య సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో అని భయపడ్డారు అభిమానులు. టాక్ ఎలా ఉన్నా..కలెక్షన్స్ పర్లేదు అనిపించాయి.మెగా హీరో సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ కాదు అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఆచార్య సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చాలా పూర్ గా ఉన్నాయంటున్నారు. మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ‘ఆచార్య’ తొలి రోజున రూ.29.50 కోట్లు వ‌సూళ్ల‌ను సాధించింద‌ని ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఆచార్య తొలిరోజు ఏపీ తెలంగాణలో కలెక్షన్ల వివరాలు …

నైజాం: 7.90 కోట్లు,
సీడెడ్: 4.60Cr(1.75Cr అద్దెలు),
UA: 3.61Cr(1Cr హైర్స్),
తూర్పు: 2.53Cr(1.30Cr),
పశ్చిమ: 2.90Cr(2Cr),
గుంటూరు: 3.76Cr(2.25Cr),
కృష్ణ: 1.90Cr(1Cr),
నెల్లూరు : 2.30 కోట్లు (1.51 కోట్లు) రాబట్టింది.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 29.50 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.

ఇక క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా, ఓవ‌ర్ సీస్ అంతా క‌లిపి చూస్తే ఆచార్య సినిమాకు రూ.42 కోట్లు పైనే వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. రూ.42 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ఉన్నాయని తాజాగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి ప్ర‌భావాన్నే చూపించింది.ఇప్పటికే మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటి వీకెండ్ ను ఎలా పూర్తి చేస్తుందో చూడాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news