Moviesమెగాస్టార్‌తో రాఘవేంద్ర బంధం వెన‌క ఇంత చ‌రిత్ర ఉందా...!

మెగాస్టార్‌తో రాఘవేంద్ర బంధం వెన‌క ఇంత చ‌రిత్ర ఉందా…!

తెలుగు చలన చిత్ర సీమకు చినుకుగా చిరంజీవిగా వచ్చిన కొణిదెల శివ శంకర వర ప్రసాద్ నాటి స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో నటించాలని ఎంతో ఉత్సుకత పడేవారు. తొలి రోజుల్లో ఆయన తాను కచ్చితంగా నటించాలి అనుకునే డైరెక్టర్స్ లో మొదటి స్థానం రాఘవేంద్రరావుదే. అప్పటికే కమర్షియల్ డైరెక్టర్ గా రాఘవేంద్రరావు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చి ఉన్నారు. ఆయన ఎన్టీయార్ తో పదమూడు సినిమాలు చేస్తే దాదాపుగా అన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. అలాగే ఏయన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు, క్రిష్ణం రాజు వంటి వారితో వరసబెట్టి సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఘనత కె రాఘవేంద్రరావుది. ఆ టైమ్ లో ఎన్టీయార్ లాంటి పవర్ ఫుల్ కమర్షియల్ హీరో రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఇక రాఘవేంద్రరావు క్రిష్ణతో ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చారు.

ఆ టైమ్‌లో టాలీవుడ్ లో ఎన్టీయార్ లేని మూలాలంగా ఏర్పడిన అతి పెద్ద వ్యాక్యూం భర్తీ చేయడానికి ఎవరికి వారుగా మిగతా హీరోలు పోటీ పడ్డారు. ఆ టైమ్ లోనే చిరంజీవి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన తొలి సినిమా పునాది రాళ్ళు అయినా రిలీజ్ అయిన తొలి సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. అది 1977లో రిలీజ్ అయింది. ఆ తరువాత వెంటనే బాపూ డైరెక్షన్ లో మనవూరి పాండవులు మూవీలో చాన్స్ వచ్చింది. రెండేళ్ళు తిరిగేసరికి చిరంజీవి చిన్న సినిమాల హీరోగా బాగానే ఎస్టాబ్లిష్ అయిపోయారు. సరిగ్గా అదే టైమ్ లో ఆయనకు కె రాఘవేంద్రరావు నుంచి పిలుపు వచ్చింది.

ఆ సినిమా శోభన్ బాబు హీరోగా తీస్తున్న మోసగాడు, ఈ సినిమాలో యంగ్ విలన్ గా చిరంజీవిని రాఘవేంద్రరావు ఎన్నుకున్నారు. అంతే కాదు రెండు పాటలను కూడా పెట్టారు. అందులో ఒక సాంగ్ తో నాటి స్టార్ హీరోయిన్ శ్రీదెవితో చిరంజీవికి ఉంది. ఈ సినిమాతో ఇలా రెండు జాక్ పాట్స్ మెగాస్టార్ కి దక్కాయి. ఈ సినిమా తరువాత కె రాఘవేంద్రరావుతో మరో సినిమా ఆఫర్ వచ్చింది. అది కూడా బంపర్ ఆఫరే. తిరుగులేని మనిషి మూవీని ఎన్టీయార్ హీరోగా కె రాఘవేంద్రరావు తీస్తే అందులో చిరంజీవి అన్న గారికి బావమరిదిగా నటించారు. ఈ సినిమాలో కూడా చిరంజీవికి సాంగ్స్ ఉన్నాయి.

ఇది జరిగిన రెండేళ్ళకు ఖైదీ మూవీ వచ్చి చిరంజీవిని స్టార్ ని చేసింది. ఇక 1984 చిరంజీవి కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ అయినది. తాను ఎంతో అభిమానించే కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఫస్ట్ టైమ్ హీరోగా నటించే చాన్స్ వచ్చిన ఏడాది. ఆ మూవీ గోపీ ఫిలింస్ బ్యానర్ మీద నాటి ప్రముఖ నిర్మాత చలసాని గోపి తీశారు. అడవి దొంగ పేరుతో వచ్చిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. అంతే చిరంజీవి చిరకాల కోరిక కూడా తీరింది.

రాఘవేంద్రరావు కూడా అప్పటిదాకా చూస్తున్న అద్భుతమైన కమర్షియల్ హీరో చిరంజీవి రూపంలో దొరికేశాడు. అలా ఎన్టీయార్ మిగిల్చి వెళ్లిన అతి పెద్ద వాక్యూం ని చిరంజీవి భర్తీ చేశారు. అడవి దొంగ తరువాత వెంటనే చిరంజీవి కె రాఘవేంద్రరావు కాంబోలో కొండవీటి రాజా మూవీ వచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఆ వరసలో ఈ ఇద్దరూ ఎన్నో సినిమాలు చేశారు. దాదాపుగా అన్నీ సూపర్ డూపర్ హిట్లే. ఇక ఈ ఇద్దరి కాంబోలో సుస్థిరమైన కీర్తిని ఆర్జించిన మూవీగా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీని చెప్పుకోవాలి.

1990 మే 9న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పటికి 32 ఏళ్ళు అయినా ఈ మూవీని అన్ని విధాలుగా కొట్టిన మూవీ మరొకటి లేదంటే అతి శయోక్తి కాదు. ఆ తరువాత కూడా ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు లాంటి సూపర్ డూపర్ హిట్లు ఈ ఇద్దరి కాంబోలో వచ్చాయి. ఇక కె రాఘవేంద్రరావు దర్శక జీవితానికి ఎన్టీయార్, మెగాస్టార్ రెండు కళ్ళు అంటే కూడా అతిశయోక్తి లేదు. అలా ఒక చిన్న పాత్ర అయినా కె రాఘవేంద్రరావు సినిమాలో చేయాలని ఉవ్విళ్ళూరిన చిరంజీవి చరిత్రను తిరగరాసే కాంబోగా ఆయనతో సెట్ కావడం అంటే అది అద్భుతమే అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news