Moviesఎన్టీఆర్ 30 కోసం ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు... ఆ ల‌క్కీ ఛాన్స్ ఎవ‌రికో...!

ఎన్టీఆర్ 30 కోసం ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు… ఆ ల‌క్కీ ఛాన్స్ ఎవ‌రికో…!

`ఆర్ఆర్ఆర్‌` తో బిగ్ హిట్‌ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్టార్‌గా మారిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో అనౌన్స్ చేసిన తెలిసిందే. గ‌త ఏడాది స‌మ్మ‌ర్‌లోనే ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ కు ఇది 30వ చిత్రం కాగా.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై క‌ళ్యాణ్ రామ్‌, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌బోతున్నారు.

త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారు. ఈ దీక్ష పూర్తైన వెంట‌నే `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ సినిమా మున్నెప్పుడూ చూడ‌ని డిఫ‌రెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండ‌బోతుంద‌ని, నా కెరీర్‌లో రాయ‌ని అతి పెద్ద క‌థ ఇద‌ని ఇటీవ‌ల కొర‌టాల ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

దీంతో ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. అయితే అంతా బాగానే ఉంది.. కానీ, ఇంత వ‌ర‌కు ఈ సినిమాలో హీరోయిన్‌ను ఖ‌రారు చేయ‌లేదు. అలియా భ‌ట్‌, కియారా అద్వానీ ఇలా కొంద‌రి పేర్లు వినిపించినా.. ఎవ‌రూ ఫైన‌ల్ కాలేదు. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. పూజా హెగ్డే, ర‌ష్మికల‌పైనే కొర‌టాల క‌న్ను ఉంద‌ని, ఈ ఇద్ద‌రు భామ‌ల్లో ఒక‌రిని ఆయ‌న ఖ‌రారు చేయ‌నున్నాడ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం పూజా, ర‌ష్మికలిద్ద‌రూ సౌత్ తో పాటు నార్త్‌లోనూ స‌త్తా చాటుతున్నారు. ఇద్ద‌రికీ పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే వీరిద్దరిలో ఒకరిని ఎన్టీఆర్ కు జోడీగా ఎంపిక చేస్తే బాగుంటుందని యూనిట్ సభ్యులతో పాటు అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. పూజా హెగ్డే అయితే కొర‌టాల తాజా సినిమా ఆచార్య‌లో న‌టించింది. అలాగే పూజ ఎన్టీఆర్‌కు జోడీగా అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌లో కూడా న‌టించింది.

మ‌రి మ‌రోసారి పూజ వైపే కొర‌టాల మొగ్గు చూపుతారా ? లేదా ఎన్టీఆర్‌కు జోడీగా ఫ్రెష్ ఫీల్ కోసం ర‌ష్మిక వైపు మొగ్గు చూపుతారా ? అన్న‌ది చూడాలి. మ‌రి ఎన్టీఆర్ 30లో పూజా హెగ్డే, ర‌ష్మిక‌ల్లో ఎవ‌రికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. కాగా, పూజా హెగ్డే ఇప్ప‌టికే ఎన్టీఆర్‌తో క‌లిసి `అరవింద సమేత వీర రాఘవ`లో న‌టించింది. దీంతో ఈ సారి ర‌ష్మికను తీసుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news