Moviesమృగ‌రాజు VS న‌ర‌సింహానాయుడు హోరాహోరీ పోరు వెన‌క ఇంత యుద్ధం జ‌రిగిందా...

మృగ‌రాజు VS న‌ర‌సింహానాయుడు హోరాహోరీ పోరు వెన‌క ఇంత యుద్ధం జ‌రిగిందా ..!

టాలీవుడ్ లో ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అంటే బాక్సాఫీస్ దగ్గర ఎంత హంగామా ఉంటుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ సంక్రాంతి కానుకగా అగ్రహీరోలు నట సింహం బాలకృష్ణ – మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి అంటే థియేటర్ల దగ్గర పెద్ద యుద్ధమే నడిచేది. దాదాపు 20 సంవత్సరాల క్రితం బాలయ్య, చిరంజీవి అభిమానుల మధ్య తమ హీరోయే గొప్ప అన్న భావన బాగా ఎక్కువగా ఉండేది. 2001 సంక్రాంతి కానుకగా ఈ ఇద్దరు హీరోలు నటించిన నరసింహనాయుడు – మృగరాజు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. నరసింహనాయుడు సినిమాకు ముందు బాలయ్య సినిమాలు అంతగా సక్సెస్ కాలేదు.

అటు చిరంజీవి సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. దీంతో రిలీజ్‌కు ముందు మృగరాజుపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అంతకుముందు గుణశేఖర్ – చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన చూడాలని ఉంది సూపర్ హిట్ అయ్యింది. ఇక నరసింహ నాయుడు సినిమాకు ముందు బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఆ తర్వాత రెండేళ్లకు మరోసారి సంక్రాంతి కానుకగా నరసింహనాయుడు వచ్చింది. సినిమా రిలీజ్ కు ముందు చిరంజీవి అభిమానులు మృగరాజు ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాస్తుందని… ఇటు బాలయ్య అభిమానులు నరసింహనాయుడు సూపర్ హిట్ అవుతుందని ఎవ‌రి ధీమాలో వారు ఉన్నారు.

ఇక నరసింహనాయుడు ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. రు. 10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక అదే రోజు రిలీజ్ అయిన మృగరాజు సినిమాకు అప్పట్లోనే రు. 15 కోట్ల భారీ బడ్జెట్ అయింది. తెలుగు సినిమా చరిత్రలో 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా మృగరాజు అప్పట్లో రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు రు. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మృగ‌రాజు సినిమాలో సింహం కోసమే ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారు. ఇక మృగరాజుతో పాటు నరసింహనాయుడు రెండు సినిమాల్లోనూ సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది. రెండు సినిమాలకు మణిశర్మ సంగీత దర్శకుడు. ఇక మృగరాజుపై భారీ అంచనాలు ఉండటంతో ఆ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

నరసింహనాయుడు సినిమాపై అంచనాలు తక్కువగా ఉండడంతో పోలిస్తే ఓపెనింగ్స్ తక్కువగా వచ్చాయి. కృష్ణా జిల్లాలో తొలివారం మృగరాజు రు. 30 లక్షల వసూళ్లు రాబడితే… నరసింహనాయుడు కేవలం రు. 23 లక్షలు మాత్రమే రాబట్టింది. అయితే రెండో వారం నుంచి బలహీనమైన కథ‌, కథనాలతో ఉన్న మృగరాజును ప్రేక్షకులు తిరస్కరించారు. రెండో వారం నుంచి నరసింహనాయుడు బాక్సాఫీస్ దగ్గర తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. లాంగ్ రన్‌లో కేవలం ఏడు కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టిన మృగరాజు రు. 10 కోట్లకు పైగా నష్టాలతో చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది.

ఇక రెండో వారం నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న నరసింహనాయుడు 124 కేంద్రాల్లో 50 రోజులు – 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. భారతదేశ చరిత్రలో 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కింది.17 కేంద్రాల్లో 175 రోజులు ఆడిన నరసింహ నాయుడు… ఏలూరులో అంబికా మినీ థియేటర్ లో ఏకంగా 300 రోజులు ఆడింది. నైజాంలో, సీడెడ్‌లో రెండు చోట్ల ఏరియాకు రు. 5 కోట్ల చొప్పున షేర్ క‌లెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నరసింహనాయుడు రు. 22 కోట్లకు పైగా షేర్ కాబట్టి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అలా ఆ సంక్రాంతి బాక్సాఫీస్ వార్‌లో బాలయ్య, చిరంజీవి పై పైచేయి సాధించారు. అదే సంక్రాంతికి వచ్చిన విక్టరీ వెంకటేష్ దేవి పుత్రుడు సినిమా సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కి రిజిస్టర్ అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news