Moviesర‌ష్మిక థై షో వెన‌క ఇంత స్కెచ్ ఉందా... మామూలు ప్లాన్...

ర‌ష్మిక థై షో వెన‌క ఇంత స్కెచ్ ఉందా… మామూలు ప్లాన్ కాదుగా…!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ సోయగం ర‌ష్మిక మంద‌న్న‌. అప్ప‌టికే క‌న్న‌డ నాట సూప‌ర్ హిట్ సినిమాల‌తో యూత్‌లో మాంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ క‌న్న‌డ చిన్న‌ది తెలుగులో త‌న తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్‌తో ఒక్క‌సారిగా యూత్ మ‌దిని గిలిగింత‌లు పెట్టేసింది. తొలి సినిమాతోనే టాలీవుడ్ బిగ్గీస్ కంట్లో ప‌డిపోయింది. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి క్రేజీ ఛాన్సులు.. సూప‌ర్ హిట్ సినిమాలతో ఇక్క‌డ గోల్డెన్‌లెగ్ అయిపోయింది.

గీత‌గోవిందం వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో ర‌ష్మిక ఒక్క‌సారిగా స్టార్ హీరోల కంట్లో ప‌డిపోయింది. ఆ త‌ర్వాత ఆమె చేసే ప్ర‌తి సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్ అవుతూ వ‌చ్చింది. మ‌హేష్‌బాబు ప‌క్క‌న ఆమె స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా చేస్తే సూప‌ర్ హిట్ అయ్యింది. ఇక గ‌తేడాది బ‌న్నీతో పుష్ప సినిమాలో న‌టిస్తే.. ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కూడా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

పుష్ప సినిమాలో శ్రీవల్లిగా రష్మిక అభినయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. సామీ సామీ పాట‌లో ఆమె వేసిన సిగ్నేచ‌ర్ స్టెప్ సోష‌ల్ మీడియాలో ఎట్టా వైర‌ల్ అవుతూ ఉందో చూస్తూనే ఉన్నాం. ర‌ష్మిక కాస్తా నేష‌న‌ల్ క్ర‌ష్మిక‌గా మారిపోయింది. ఈ క్రేజ్‌తో ఆమె బాలీవుడ్‌లో పాగా వేయాల‌ని కొద్ది రోజులుగా ట్రై చేస్తోంది. మిస్ట‌ర్ మ‌జ్నులో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో క‌లిసి న‌టిస్తోన్న ఆమె గుడ్ బై సినిమాలో ఏకంగా బిగ్ బీ అమితాబ్‌తో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.

ఈ సినిమాలో ర‌ష్మిక అమితాబ్ కూతురుగా క‌నిపించ‌నుంది. ఈ రెండు సినిమాలు త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సుల కోసం ర‌ష్మిక అక్క‌డ మీడియాతో పాటు హీరోల కంట్లో ప‌డేందుకు గ్లామ‌ర్ గేట్లు ఎత్తేసిన‌ట్టే ఉంది. బాలీవుడ్ మీడియా ముందు హాట్ హాట్ డ్రెస్సులు వేసుకుని మ‌రీ ఫొటోల‌కు పోజులు ఇస్తోంది. ఇవి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

పుష్ప‌కు ముందు పుష్ప త‌ర్వాత పోల్చి చూస్తే మ‌రింత హాట్‌గా క‌న‌ప‌డేందుకు ఇష్ట‌ప‌డుతోంది. ఆమె థై షో చేస్తూ కుర్ర‌కారును బాగా క‌వ్విస్తోంది. ఈ ఫోటోలు చూసినోళ్లంతా ర‌ష్మిక థై షో అంతా బాలీవుడ్ కోస‌మే అని గుస‌గుస‌లాడుకుంటున్నారు. ఇప్ప‌టికే క్రేజీ ఆఫ‌ర్ల‌తో రేటు పెంచేసిన ర‌ష్మికకు ఇప్పుడు బాలీవుడ్ ఛాన్సులు వ‌స్తే మ‌రింత కొండెక్కేయ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news