Moviesవాటి సైజు తగ్గించుకో..హాట్ బ్యూటీ పై ఇంతటి హాట్ కామెంట్స్..వినలేం బాబోయ్..?

వాటి సైజు తగ్గించుకో..హాట్ బ్యూటీ పై ఇంతటి హాట్ కామెంట్స్..వినలేం బాబోయ్..?

నేటి కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ లు ఉంటున్నాయి. వాటిలో సోషల్ మీడియా యాప్ లు ఇన్ స్టాల్ చేసుకునేస్తున్నారు. అంత వరకు బాగానే ఉంది. కానీ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను కొందరు మంచికి మాత్రమే ఉపయోగిస్తే..మరికొందరు చెడుకు ఉపయోగిస్తున్నారు. అంతేకాదు దాని ద్వార మిగత వారిని కూడా బాధపడేలా చేస్తున్నారు. ఇలా ఒకటి,రెండుసార్లు కాదు..ఏకంగా కొన్ని వేల సార్లు పలువురు నెటిజన్స్ స్టార్ సెలబ్రిటీలను కించపరిచే విధంగా కామెంట్స్ చేసిన సంధర్భాలు ఉన్నాయి.

ఇక వాళ్లల్లో కొందరు సెలబ్రిటీస్ చెప్పుతోకొట్టిన్నట్లు ఆన్సర్ ఇస్తుండగా..మరికొందరు సెలబ్రిటీస్ అభిమానులతో లైవ్ చేయడమే మానేసారు. కెరీర్ స్టార్టింగ్ లో అలాంటి అనుభవమే ఎదురైంది ఢిల్లీ భామ కృతిస‌న‌న్ కి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ 1 నేనొక్కడినే ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కృతిసనన్. ఆతర్వాత తెలుగులో అక్కినేని కుర్రాడు నాగచైతన్య నటించిన దోచేయ్ అనే సినిమాలో కూడా నటించింది. కానీ పెద్దగా జనాలు అమ్మడుని పట్టించుకోలేదు. దీంతో ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ మళ్ళీ బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తన సినిమా అప్డేట్స్ తో పాటు హాట్ హాట్ ఫోటోలను , వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది కృతిసనన్. ఈ హాట్ బ్యూటీ ఎవ్వరు ఊహించని విధంగా బాలీవుడ్ మూవీ ‘మిమి’లో గర్భవతిగా నటించి విమర్శకుల ప్రశంసలను అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఓ మీడియా ఇంటరాక్షన్‌లో ఆమె మాట్లాడుతూ.. బాడీ షేమింగ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కృతి మాట్లాడుతూ..” కెరీర్ మొదట్లో నేను సినిమాలు చేసేటప్పుడు నా అందంపై పలువురు నెటిజన్లు నన్ను సూటిపోటి మాటలతో బాధపెట్టారు. ఆ మాటలు నా మనసును బాగా గాయపరిచాయి. అందరి జనాల కళ్ళు నా పెదాలపై పడ్డాయి. నా పెదాలు చూసేందుకు లావుగా ఉంటాయని..అస్సలు బాగోవని..వాటి సైజు ను తగ్గించుకోమని. సర్జరీతో పెదాల ఆకృతి సరిచేసుకోమని నాకు చాలా సార్ల్య్ సూచించారు. నానా రకాలుగా అవహేళన చేశారు’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇవన్నీ మార్చుకునేందుకు నేను ప్లాస్టిక్ బొమ్మను కాదని నాకు నచ్చిన్నట్లే నేను ఉంటా అంటూ తెగేసి చెప్పింది కృతి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news