Moviesఅల్లు వారితో కొత్త బంధాని కలుపుకోనున్న దగ్గుబాటి ఫ్యామిలీ..అస్సలు ఊహించలేదుగా..?

అల్లు వారితో కొత్త బంధాని కలుపుకోనున్న దగ్గుబాటి ఫ్యామిలీ..అస్సలు ఊహించలేదుగా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీది ఎంత విజయవంతమైన ప్రస్థానం తెలిసిందే. నిర్మాత దగ్గుబాటి రామానాయుడు భారతదేశంలోని అన్ని భాషల్లోనూ సినిమాలు నిర్మించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. శతాధిక చిత్రాల నిర్మాతగా సినిమా రంగంపై తన కంటూ ఎంత మక్కువ‌ వుందో రామానాయుడు ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. ఈ రోజు తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న వారందరూ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమాలు చేసినవారే. రామానాయుడు ఎప్పుడు కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ముందుండేవారు. ఆయన బ్యానర్ లో వచ్చిన సినిమాల ద్వారానే ఎంతో మంది అగ్ర దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఇక ఆయన వారసులుగా వచ్చిన ఇద్దరు కొడుకులు సినీ ఇండస్ట్రీలో మచి పోజీషన్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీతో అల్లు వారు కొత్త బంధాని కలుపుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరో హీరోయిన్లు బుల్లితెర పై కనిపించ్డానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. వెండితెర పైనే కాదు బుల్లి తెర పై కూడా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. బాలీవుడ్ స్టార్స్ మొదలుకొని అన్ని భాషల్లోని సినీ తారలు బుల్లితెర కార్యక్రమాలను హోస్ట్ చేసేందుకు మక్కువ చూపుతున్నారు.

ఇక ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, హీరోయిన్ సమంత,రమ్యకృష్ణ, బాలయ్య లాంటి వారు బుల్లితెరపై తమ మార్క్ చూపించగా రీసెంట్‌గా ఆ లిస్ట్ లోకి దగ్గుబాటి వారసుడు స్టార్ సీనియర్ హీరో వెంఖటేష్ కూడా చేరబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ‘ఆహా’లో ప్రసారమవుతున్న అన్‌స్టాపబుల్ షో హ్యుజ్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుందో మనం చూశాం. ఇక ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం ఓ సరికొత్త ఎంటర్‌టైనింగ్ ప్రోగ్రాం డిజైన్ చేపిస్తున్నారట.

ఈ షో కోసం హోస్టుగా వెంకటేష్‌ని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే ఈ షో కి సంబంధించి ఫుల్ డీటైల్స్ కూడా వెంఖటేష్ కు చెప్పారని.. ఆయన కూడా ఇందుకు ఓకే చెప్పారని తెలుస్తుంది. వెంకటేష్‌ని ఒప్పించేందుకు స్వయంగా అల్లు అరవింద్ ఇంటికెళ్లి మరి ఈ షో కు సంతకం చేయించుకున్నాడని ఇన్‌సైడ్ టాక్. మరి చూడాలి ఈ షో ఎలా ఉండబోతుందో..వెంకీ హోస్ట్ గా ఎలా మెప్పిస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news