Moviesజయలలితకు ఆ క్రికెటర్ అంటే అంత పిచ్చా..అందుకే అలా చేసిందట..అప్పట్లో అదే...

జయలలితకు ఆ క్రికెటర్ అంటే అంత పిచ్చా..అందుకే అలా చేసిందట..అప్పట్లో అదే సెన్సేషన్ ?

జయలలిత..తమిళనాట రాజకీయాల్లో తనకంటూ ఓ చెరగని ముద్ర వేసుకున్న ప్రజా నాయకురాలు. అందరికి అమ్మ లా కనిపించే ఈమె తప్పు చేసేవారికి మాత్రం యమదూతల కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి జయలలిత గురించి ఎంత చెప్పిన తక్కువే. అటు సినిమాల్లోను ఇటు రాజకీయాల్లోను తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది. ఆమె అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను సైతం మంత్రముగ్దులను చేసింది.

జయలలిత కు ఎంత పాపులారిటీ ఉన్నిందంటే..ఆమె నటించే సినిమాల్లో స్టార్ హీరోలతో సమానమైన స్టార్ డమ్ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు, తమిళం, కన్నడ అనే భాషలో తేడా లేకుండా అన్ని భాషలలో నటించి అగ్ర కథానాయికగా తన సత్తా చాటుకుంది. ఇక జయలలితకు మూగ జీవాలు అంటే చాలా ఇష్టమమట. ఆమెకు సమయం ఉన్నప్పుడల్లా వాటితోనే టైం గడుపుతుందట. ఇక త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి ఒక‌ప్ప‌టి గ్లామ‌ర‌స్ హీరోయిన్ దివంగ‌త జ‌య‌ల‌లితకు క్రికెట్ అంటే చచ్చేంత ఇష్టమట. క్రికెట్‌ ఆట అన్నా, అది ఆడేవాళ్ల‌న్నా ఆమెకు చిన్న‌ప్ప‌ట్నుంచీ ఎంతో ఇష్టం అని పలు ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది.

జయలలితకు క్రికెట్ అంటే ఎంత పిచ్చి అంటే..చిన్న వయసూలోనుండే క్రికెట్ కు సంబంధించిన ఎటువంటి ఫోటో పేపర్లో వచ్చిన దానిని కత్తిరించి తన డైరీలో ఇష్టంగా దాచుకునేదట. ఇక ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్న రోజుల్లో కూడా క్రికెట్ వస్తోందంటే చాలు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరి అలాగే చూస్తూ ఉండేదట. ఆమె కు అంత ఇష్టమట క్రికెట్ అంటే. మరీ ముఖ్యంగా ఆమె సీఎంగా ఉన్నప్పుడు తమిళనాడులో ఏదైనా మ్యాచ్ జరుగుతోందంటే ఖచ్చితంగా జయలలిత ఆ మ్యాచ్ చూడకుండా వెళ్ళేది కాదట.

అంతేకాకుండా అక్కడకి వచ్చిన క్రికెటర్లను కలిసి వారి ఆటోగ్రాఫ్ లను తీసుకుని..వారితో ఫోటోలను తీసుకుని…వాటిని అపూరూపకంగా దాచుకునేదట. ముఖ్యంగా అప్పుడు టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అంటే జయలలితకు పిచ్చ ఇష్టమట. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అప్పుడే అతనికి ఎన్నోసార్లు కలిసి ఆయన ఆట అంటే ఆమెకు ఎంత ఇష్టమో చెప్పేదట.. ఈ విషయాన్ని తనే స్వయంగా తన డైరీలో కూడా రాసుకుందని సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news