Moviesజై బాల‌య్యా... కొత్త సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ ఇదే..!

జై బాల‌య్యా… కొత్త సినిమాపై అదిరిపోయే అప్‌డేట్ ఇదే..!

ప్ర‌స్తుతం తెలుగు సిని అభిమానుల్లో ఎక్క‌డ చూసినా జై బాల‌య్య నినాదం హోరెత్తుతోంది. ఎవ‌రి నోట విన్నా యా యా యా జై బాల‌య్యా అన్న పాటే వినిపిస్తోంది. అటు థియేటర్లోల‌నూ, ఇటు బుల్లితెర ఓటీటీలో కూడా అఖండ గ‌ర్జ‌న మార్మోగుతోంది. ఇటీవ‌లే 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీలో ల‌క్ష‌ల వ్యూస్‌తో దూసుకు పోతోంది. అఖండ ఇటు థియేట‌ర్ల‌లో, అటు ఓవ‌ర్సీస్‌లోనూ, ఇటు ఓటీటీలోనూ సూప‌ర్ హిట్ అయ్యింది. తాజాగా కోలీవుడ్‌లో రిలీజ్ అయ్యి.. అక్క‌డ కూడా మాస్ జ‌నాల‌ను వెర్రెక్కించేస్తోంది.

ఇక ఓవ‌ర్సీస్‌లో అఖండ ఎప్పుడో మిలియ‌న్ మార్క్ డాల‌ర్ల‌ను క్రాస్ చేసేసింది. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఓ సినిమా థియేట‌ర్ల‌లో రెండు, మూడు వారాల మించి నిల‌బ‌డ‌డం లేదు. అలాంటిది అఖండ వంద కేంద్రాల్లో 50 రోజులు ఆడ‌డం అంటే మామూలు సంచ‌ల‌నం కాదు. ఇక బాల‌య్య ఆహా ఓటీటీలో అన్‌స్టాప‌బుల్ షో చేస్తున్నాడు. ఈ షోతో అల్లు అర‌వింద్‌కు కావాల్సినంత క్రేజ్‌తో పాటు భారీ ఆదాయం కూడా స‌మ‌కూరింది.

ఇలా వెండితెర‌, బుల్లితెర స‌క్సెస్‌ల‌తో ఫుల్ జోష్‌లో ఉన్న బాల‌య్య త‌న నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నాడు. క్రాక్ లాంటి సూప‌ర్ హిట్‌తో ఫామ్‌లో ఉన్న గోపీచంద్ మ‌లినేని సినిమాలో బాల‌య్య న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చేసింది. ఫిబ్ర‌వ‌రి 12 నుంచి షూట్ ప్రారంభం కానుంది. ద‌స‌రాకు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా స్టార్టింగే యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో ప్రారంభించ‌నున్నారు.

మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించే ఈ సినిమాలో శృతీహాస‌న్ క‌థానాయిక‌. కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా.. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news