Moviesస్టార్ నిర్మాత కొడుకుతో హీరోయిన్ డేటింగ్‌... క్లారిటీ ఇచ్చేసింది..!

స్టార్ నిర్మాత కొడుకుతో హీరోయిన్ డేటింగ్‌… క్లారిటీ ఇచ్చేసింది..!

సాయి మంజ్రేక‌ర్ ఇప్పుడు బాలీవుడ్‌లో పాపుల‌ర్ రేటింగ్‌లో ఉన్న కుర్ర హీరోయిన్‌. సీనియ‌ర్ న‌టుడు, విల‌న్ పాత్ర‌లు వేసే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు మ‌హేష్ మంజ్రేక‌ర్‌కు సాయి కుమార్తె. బాలీవుడ్‌లో ద‌బాంగ్ 3 సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయ్యింది ఇటు టాలీవుడ్‌లో కూడా ఆమెకు రెండు మూడు ఆఫ‌ర్లు వ‌చ్చాయి. మ‌హేష్‌బాబు ప‌క్క‌న కూడా ఓ సినిమాలో న‌టించే ఛాన్స్ వ‌చ్చినా తృటిలో మిస్ అయ్యింది.

 

ఆమెకు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో ఆమెను టాలీవుడ్‌లో కూడా న‌టింప‌జేయాల‌న్న ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమాగా వ‌స్తోన్న అడ‌వి శేష్ మేజ‌ర్ సినిమాలో ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈమె కొంత కాలంగా ఓ అగ్ర నిర్మాత కొడుకుతో ప్రేమ‌లో ప‌డింద‌ని.. అత‌డితో డేటింగ్ చేస్తోంద‌న్న పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ కుమారుడు సుభాన్ న‌డియ‌ద్ వాలాతో డేటింగ్ చేస్తుంద‌న్న పుకార్లు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. వీరిద్ద‌రు క‌లిసి ఉన్న ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇక బాలీవుడ్ మీడియా కూడా వీరి డేటింగ్ వార్త‌ల‌ను ఒక్క‌టే ప్ర‌చురిస్తోంది. ఈ వైర‌ల్ వార్త‌ల‌పై సాయి మంజ్రేక‌ర్ స్పందించింది.

తాము డేటింగ్‌లో ఉన్నాం అని వ‌స్తోన్న వార్త‌లు అన్నీ అస‌త్యాలే అని.. తాము చిన్న‌ప్ప‌టి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది. అస‌లు ఈ వార్త‌లు ఎందుకు పుట్టుకు వ‌స్తాయి ? వీటిపై ఎలా స్పందించాలో కూడా త‌న‌కు తెలియ‌ట్లేద‌ని వాపోయింది. ఇక చిన్న‌ప్ప‌టి నుంచే త‌న‌మీద పుకార్లు పుట్టించ‌డం కామ‌న్ అయిపోయింద‌ని.. తానేంటో త‌న కుటుంబ స‌భ్యుల‌కు, త‌న స్నేహితుల‌కు తెలుసు అని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news