Moviesపుష్ప సీన్లో సురేఖ‌వాణి.. కూతురు సుప్రీత‌... ఈ వయ‌స్సులో ఎంత అందం...

పుష్ప సీన్లో సురేఖ‌వాణి.. కూతురు సుప్రీత‌… ఈ వయ‌స్సులో ఎంత అందం రా బాబు (వీడియో)

సురేఖ‌వాణి… తెలుగు సినిమా అభిమానులు అంద‌రికి బాగా తెలుసు. సురేఖ వాణి పేరుకు మాత్ర‌మే క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌. ఆమె గ‌త కొన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో అక్క‌, వ‌దిన పాత్ర‌ల‌తో పాటు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తోంది. హీరోయిన్ల‌తో స‌రిపోల్చే అందం ఆమెది. అయితే ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే సోష‌ల్ మీడియాలో ఆమెకు స్టార్ హీరోయిన్ల‌కు లేనంత ఫాలోయింగ్ ఉంది. నాలుగున్న‌ర ప‌దుల వ‌య‌స్సు దాటేసినా కూడా సురేఖ వాణి త‌న కుమార్తె సుప్రీత‌తో క‌లిసి హాట్ హాట్ వీడియోలు, వ‌ర్క‌వుట్లు చేస్తోన్న ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది.

సురేఖ‌వాణి కూతురుతో క‌లిసి పోస్ట్ చేసే వీడియోల‌కు, ఫొటోల‌కు సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో క్రేజ్ ఉంటోంది. లైకులు, కామెంట్ల వ‌ర్షం కురుస్తోంది. కొంద‌రు ఆమె ఫొటోలు, వీడియోల‌కు పాజిటివ్‌గా స్పందిస్తుంటే.. కొంద‌రు ఈ వ‌య‌స్సులో నీకు ఇవి అవ‌స‌ర‌మా ? అని నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు. త‌న గురించి ఎవ‌రేమ‌నుకున్నా సురేఖ‌వాణి మాత్రం తాను ఏం చేయాల‌నుకున్నానో అదే కాన్ఫిడెంట్‌గా చేసేస్తూ ఉంటోంది.

అంతేకాదు.. ఇటీవ‌ల కాలంలో సురేఖ త‌న డ్రెస్సింగ్ స్టైల్ కూడా పూర్తిగా మార్చేసింది. పొట్టి పొట్టి డ్రెస్సులతో పాటు హాట్ హాట్ డ్రెస్సులు వేస్తూ ఫాలోవ‌ర్స్‌కు హీరోయిన్ రేంజ్‌లో కిక్ ఇస్తోంది. లేటు వ‌య‌స్సులో కూడా సురేఖ‌వాణి అంద‌చందాల‌తో పాటు ఆమె ఎన‌ర్జీ చూసి నెటిజ‌న్లు కూడా మెస్మ‌రైజ్ అవుతున్నారు. ఇక సురేఖ‌వాణి కూతురుకు ఇప్ప‌ట‌కీ ఇండ‌స్ట్రీకి ఎలాంటి సంబంధం లేక‌పోయినా త‌న త‌ల్లి పాపులారిటీతో ఆమె కూడా సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతూ ఫాలోవ‌ర్స్‌కు వీనుల విందు వ‌డ్డిస్తోంది.

తాజాగా సురేఖ‌వాణి త‌న కూతురు సుప్రీత‌తో క‌లిసి పుష్ప సీన్ రీల్ చేసింది. ఈ వీడియోను సురేఖ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ వీడియోలు సురేఖ త‌న కూతురు సుప్రీత‌ను మించిన అందంతో క‌నిపిస్తోంది.
ఈ వ‌య‌స్సులో కూడా ఆమె చాలా స్లిమ్‌గా అందంగా క‌నిపించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్గా మారింది. ఈ వీడియో కింద కొంద‌రు నెటిజ‌న్లు మీ కూతురు కంటే ఆంటీ వ‌య‌స్సులోనూ మీరే అందంగా ఉన్నార‌ని కామెంట్లు చేస్తుంటే.. మ‌రి కొంద‌రు వీళ్ల‌ను ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news