Movies50 ఏళ్ల వ‌య‌స్సులో 30తో టెంప్ట్ చేస్తోన్న ఈ స్టార్ హీరోయిన్...

50 ఏళ్ల వ‌య‌స్సులో 30తో టెంప్ట్ చేస్తోన్న ఈ స్టార్ హీరోయిన్ సీక్రెట్స్ తెలుసా..!

చాలా మంది హీరోయిన్లు ఐదు ప‌దుల వ‌య‌స్సులో ఉన్నా కూడా 25 – 30ల్లో ఉన్న‌ట్టు టెంప్ట్ చేస్తూ వ‌స్తున్నారు. క‌పూర్ వంశంలో తొలి త‌రం గ‌ట్స్ ఉన్న హీరోగా 30 ఏళ్ల క్రితం ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేసింది క‌రిష్మా క‌పూర్‌. ఆమె రెండు ద‌శాబ్దాల‌కు పైగానే బాలీవుడ్‌ను ఏలేశారు. అప్ప‌ట్లో స్టార్ హీరోలు అంద‌రి ప‌క్క‌న వ‌రుస పెట్టి న‌టించిన ఆమె క‌పూర్ కుటుంబ మూసకు చెక్ పెట్టేసి గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఓ వెలుగు వెలిగిపోయింది.

1990ల్లో ఆమె ఏ సినిమా చేసినా ఓ సంచ‌ల‌న‌మే అన్న‌ట్టుగా ఉండేది. ఇప్పుడు క‌రిష్మా ఏజ్ 50. అయితే ఈ వ‌య‌స్సులో ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయినా కూడా ఆమె పాతిక ప్రాయంలో ఉన్న హీరోయిన్ ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. తాజాగా క‌రిష్మా పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ సీనియ‌ర్ న‌టి పూర్తి ఫిట్‌గా ఉండ‌డంతో ఆమె కుర్ర హీరోయిన్ల‌కు ఏ మాత్రం సాటిరాన‌ని ఫ్రూవ్ చేసుకుంటోంది.

బ్లాక్ క్రాప్ టాప్‌తో పాటు లేత గోధుమ ఫ్యాంటుతో ఆమె ఇచ్చిన స్టిల్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను వైర‌ల్ చేస్తోంది. ఇక క‌రిష్మా ఫ్రెండ్ మరో ముదురు ఆంటీ మలైకా అరోరా కూడా ప్ర‌శంసించింది. క‌రిష్మా 1990ల్లో క‌వ‌ర్ మ్యాగ‌జైన్ల‌కు హాట్ హాట్‌గా స్టిల్స్ ఇచ్చిన‌ప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయినా కూడా ఆమె ఇంత అందంతో ఉండ‌డంతో పాటు స‌రికొత్త స్టిల్స్‌తో క‌వ్విస్తూ ఉండ‌డంతో ఆమె సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేస్తుందా ? అన్న డౌట్లు కూడా వ‌స్తున్నాయి.

ఇక పెళ్ల‌య్యాక అమెరికాతో త‌న భ‌ర్త‌తో 15 ఏళ్లు కాపురం చేసిన క‌రిష్మా ఆ త‌ర్వాత భ‌ర్త‌తో విబేధాలు రావ‌డంతో విడిపోయింది. అప్ప‌టి నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటోంది. ఇక క‌రిష్మా చెల్లి క‌రీనా కూడా అగ్ర హీరోయిన్‌గా పాపుల‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత ఆమె బాలీవుడ్ కండ‌ల హీరో సైఫ్ ఆలీఖాన్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news