Moviesచూపు తిప్ప‌నివ్వ‌ని జూనియ‌ర్ అతిలోక సుంద‌రి... బికినీ ట్రీట్ అదిరింది..!

చూపు తిప్ప‌నివ్వ‌ని జూనియ‌ర్ అతిలోక సుంద‌రి… బికినీ ట్రీట్ అదిరింది..!

అతిలోక సుంద‌రి శ్రీదేవికి ఈ త‌రం జ‌న‌రేష‌న్లో కూడా ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్నారు. 1980 – 1990 ద‌శ‌కంలో శ్రీదేవి త‌న అంద‌చందాల‌తో ఎంతో మంది అభిమానుల హృద‌యాలు కొల్ల‌గొట్టింది. స్వ‌త‌హాగా ఏపీలోని చిత్తూరు జిల్లా మూలాలు ఉన్న శ్రీదేవి కోలీవుడ్ కంటే కూడా టాలీవుడ్ సినిమాల‌తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. అప్ప‌ట్లో శ్రీదేవి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు త‌రం హీరోల‌తోనే కాకుండా ఆ త‌ర్వాత జ‌న‌రేష‌న్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ‌సామ్రాట్ నాగార్జున ప‌క్క‌న కూడా న‌టించింది.

శ్రీదేవికి త‌మిళ్‌లో కంటే తెలుగులో వ‌చ్చిన పాపులారిటీ త‌ర్వాతే ఆమెకు బాలీవుడ్‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. ఒక్క‌సారి బాలీవుడ్‌లోకి వెళ్లాక శ్రీదేవి వెన‌క్కు తిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక ఆమె కుమార్తె జాన్వీక‌పూర్ కూడా శ్రీదేవి ఉండ‌గానే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే శ్రీదేవి మృతి చెందింది. ఇక స్టార్ హీరోయిన్‌గా నిల‌దొక్కుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతూ ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ‌ప్ చేసుకుంటోన్న జాన్వీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్ప‌డిక‌ప్పుడు త‌న హాట్ హాట్ అందాలతో బాగా పాపుల‌ర్ అవుతోంది.

స్టార్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తగ్గ‌కుండా జాన్వీ త‌న అంద‌చందాలు ఆర‌బోస్తూ నెట్టింట్లో మాత్రం పాపుల‌ర్ అయ్యేందుకు ట్రై చేస్తోంది. జాన్వీ చీర‌ట్టులోనూ, మోడ్ర‌న్ లుక్‌లోనే కాకుండా బికినీలోనూ అప్పుడ‌ప్పుడూఏ ద‌ర్శ‌న‌మిస్తూ ఉంటోంది. తాజాగా ఆమె త‌డిసిన అందాల‌తో పూల పూల బికినీతో ఆక‌ట్టుకుంటోంది. ఈ బికినీ స్టిల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. నెటిజ‌న్లు వావ్ ఏం అందం అంటూ కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు.

ఇక ఈ యేడాది జాన్వీ మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో న‌య‌న‌తార న‌టించిన కోకిల సినిమా రీమేక్ కూడా ఉంది. ఇక టాలీవుడ్‌లో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న‌ట్టు యేడాది కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. జూనియ‌ర్ ఎన్టీఆర్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోంద‌న్న ప్రచారం జ‌రిగినా అవి నిజం కాలేదు. మ‌రి జాన్వీని తెలుగులో హీరోయిన్‌చూసే ఛాన్స్ ఎప్పుడు వ‌స్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news