Moviesవాడు నా చేతిలో అయిపోయాడు.. బాలయ్య స్ట్రైయిట్ వార్నింగ్..!!

వాడు నా చేతిలో అయిపోయాడు.. బాలయ్య స్ట్రైయిట్ వార్నింగ్..!!

ఎవ్వరు ఊహించని విధంగా నంద‌మూరి బాలకృష్ణ హోస్ట్ గా ఈ టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. అన్‌స్టాప‌బుల్‌ విత్ ఎన్‌బీకే..అనే పేరుతో కొనసాగుతున్న ఈ షో ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుటుంది. అస్సలు ఈ షో ఆయన ఎన‌ర్జీ, స్పాంటెనియస్ పంచ్ లు చూస్తుంటే..ఆయన ముందు హోస్ట్ గా ఎవ్వరు పనికిరారు ఏమో అన్నట్లు మాటలు వినబడుతున్నాయి. చ‌మ‌త్కారం, క‌లుపుగోలుత‌నం, కు అభిమానులే కాదు బడా బడా సెల‌బ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారనడంలో అతిశయోక్తి లేదు.

ఇప్ప‌టికే ఎంతోమంది సినీ తార‌లు ఈ షోకు విచ్చేసి బాలయ్యతో సంద‌డి చేసారు. మెహన్ బాబు, రాజమౌళి, బ్రహ్మనందం, రవితేజ, రానా, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని వంటి ప్రముఖులు వచ్చి సందడి చేశారు. రీసెంట్ రౌడి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ వచ్చాడు. ఆయనతో పాటు డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్‌, అందాలతార చార్మీ కౌర్.. అన్‌స్టాప‌బుల్‌ షో కి గెస్ట్ లు గా వచ్చి ర‌చ్చ‌ర‌చ్చ చేశారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్ర‌స్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ఈ ఎపిసోడ్‏ నుంచి సరదా ఓ క్లిప్పింగ్ షేర్ చేసింది ఆహా. ఇక అందులో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “టాక్ షో అనగానే ఏదో మడి కట్టుకుని కూర్చుని.. నాలుగు ప్రశ్నలు అడిగేసి.. అవతలి ఉన్న వ్యక్తి తెలివిగా సమాధానం చెబితే అలాంటి ఆన్సర్స్ విని నవ్వడం నా వల్ల కాదని చెప్పాను. అందుకు ఒక కండీషన్ కూడా పెట్టా. వచ్చిన వాళ్లను ఎవరైనా సరే సరాదాగా ఆడుకుంట..అభిమానులను ఎంటర్ టైన్ చేస్తా అని చెప్పానని అన్నారు.

ఇక ఈ సందర్భంగా గెస్త్ గా వచ్చిన విజయ్ దేవరకొండను ఓ రేంజ్ లో ఆడుకున్నారు బాలయ్య. సెట్ లో వేలాడదీసిన శాండ్ బ్యాగ్ ను తన్నమన్నారు. విజయ్ గట్టిగా దాన్ని తన్నడంతో అది తిరిగి వెనక్కు వచ్చింది. ఇక అప్పుడు బాలయ్య..తాను మొదట నటించిన మొదటి మూవీ ఏది ? అని ప్రశ్నించగా.. దానికి విజయ్ నీళ్లు న‌ములుతుం.డ‌గా. షోకు వచ్చిన అభిమానుల్లో ఒకరు తాతమ్మ కల అని టక్కున సమాధానం చెప్పేశాడు. అప్పుడు వెంటనే బాలయ్య ” వాడు నా చేతిలో అయిపోయాడు.. ఖతం” అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news