Moviesఊ అంటావా? అంటూ ఊపేసిన ప్రగతి..తట్టుకోవడం కష్టమే..!!

ఊ అంటావా? అంటూ ఊపేసిన ప్రగతి..తట్టుకోవడం కష్టమే..!!

సీనియర్ నటి ప్రగతి…ఈ మధ్య కాలంలో ఎక్కువుగా వినిపిస్తున్న పేరు. ఓ పక్క సినిమాలోనే నటిస్తూనే మరో పక్క సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సెలబ్రెటీలో ప్రగతి ముందు వరుసలో ఉంటుంది. సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తెలుగులో ఇప్పుడు అత్త , తల్లి, పిన్ని ఇలాంటి సపోర్టింగ్ పాత్రలు చేస్తూ తనదైన స్టైల్ లో మెప్పిస్తుంటుంది. ఎంత వయసు వచ్చినా కూడా ప్రగతి ఆంటీ తన అందంతో, అభినయంతో స్టార్ హీరోయిన్లకు మించిన‌ హైప్ క్రియేట్ చేసుకుంటుంది. కొన్ని సారులు ఈమె వీడియోలు చూస్తుంటే హీరోయిన్స్ కూడా అమ్మడు ముందు దేనికి పనికి రారు అంటింటారు కొందరు నెటిజన్స్. ఈ వయసులో కూడా ప్రగతి ఆంటీ స్టార్ హీరోయిన్లకు పోటీగా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలతో వీనుల విందు చేస్తూ ఉంటుంది. అంతేకాదు తీన్మార్ స్టెప్పులతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ కూడా అవుతోంది ప్రగతి.

ఇక రీసెంట్ గా ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న ఐటెం సాంగ్ “ఊ అంటావా మావ..ఊ ఊ అంటావా మావా” అనే పాటకు తనదైన స్టైల్లో మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టేసింది. గతేడాది తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “పుష్ప” సినిమాలోని ఈ పాట ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న వాళ్ల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు అందరిని ఓ ఊప్ ఊపేసింది. ఇక యూట్యూబ్ లో ఇటీవల ఈ సాంగ్ పుల్ వీడియో విడుదల కాగా కొన్ని గంటల్లోనే రికార్డు వ్యూస్ అందుకుంది. ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రముఖులతో పాటు నెటిజన్లు ఈ పాటను అనుకరిస్తూ షార్ట్స్, రీల్స్ చేస్తున్నారు.

ఈ క్రమ్మలోనే నటి ప్రగతి వేసిన హాట్ మాస్ స్టెప్పులు..కుర్రాలను తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రగతి ఆంటీ మామూలు పాటకే ఓ రేంజ్ లో చిందులేసి అదరగొడుతుంది..ఇక ఈ మాస్ పాట కి ప్రగతి వేసిన స్టెప్పులు చూస్తే దిమ్మ తిరగాల్సిందే. ప్రస్తుతం ఈ పాటకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. తాజాగా వర్కవుట్లు చేసిన అనంతరం ప్రగతి మాస్ స్టెప్పులు వేసింది. ఊ అంటావా? మావ అంటూ అందరినీ ఆకట్టుకుంది. మరి ఎందుకు ఆలస్యం మీరు మీరు ఓ లుక్కేయ్యండి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news