Moviesవాళ్ళ భార్యలు నిజంగానే గ్రేట్..వామ్మో ఏంటి ఇలా అనేసింది..?

వాళ్ళ భార్యలు నిజంగానే గ్రేట్..వామ్మో ఏంటి ఇలా అనేసింది..?

సింగర్ చిన్మయి శ్రీపాద.. ఈ పేరు వింటే కొందరు మైమరిచిపోతారు. మరికొందరు బెదిరిపోతారు. ఇంకొందరు ఆమెకు పెద్ద దండం రా బాబోయ్ అంటుంటారు. ఇలా అన్నీ వేరియేషన్స్ మిక్స్ చేసి కలిపిన అమ్మాయే చిన్మయి. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా..సింగర్ గా..సమాజాలో జరిగే తప్పులను వేళ్లు ఎత్తి చూపే మనిషిగా చాలా మందినికి ఆకట్టుకుంది. అంతేకాదు తమిళ రైటర్ వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలతో మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే. కేవలం సింగర్ గానే కాకుండా సామాజిక అంశాలపై గళం ఎత్తుతూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు సింగర్ చిన్మయి. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ.. సంచలన విషయాలతో హాట్ టాపిక్ అయ్యారు సింగర్ చిన్మయి. సోషల్ మీడియాలో ఎప్పూడు యాక్టివ్‌గా వుండే ఈ సింగర్ తనదైన స్టైల్‌లో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగింక వేధింపులను అడ్రెస్ చేస్తూ అవసరమున్నవారికి అండగా ఉంటోంది.

ఇక కాంట్రవర్షియల్ మ్యాటర్ లో ఎప్పుడు ముందుండే చిన్మయి రీసెంట్ గా చేసిన పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. జనరల్ గా ఆడవాళ్లు పెళ్లైన తరువాత ఏ జాబ్ చేసినా, బయటకు వెళ్లినా.. ఎంతో ఎత్తుకు ఎదిగినా ఆ క్రేడిట్ అంతా కూడాభర్తకు ఇస్తుంటారు. అతేనా మీ భర్త చాలా గ్రేట్.. మిమ్మల్ని ఇలా పని చేసుకోవడానికి ఒప్పుకున్నారు. బయటకు పంపారు.. అంటూ కొన్ని మాటలు వినిపిస్తుంటాయి. ఇలాంటి మాటలకు దర్శకురాలు సుధా కొంగర గట్టి సమాధనం ఇచ్చింది. నేను నాకు ఇష్టమైన పని చేయడానికి నాకు ఎవరూ పర్మిషన్ గానీ.. అంగీకారాన్ని గానీ ఇవ్వలేదు. నాకు నచ్చింది నేను చేస్తున్నాను అంటుంటారు సుధా కొంగర.

 

 

View this post on Instagram

 

A post shared by Chinmayi Sripada (@chinmayisripaada)

ఇక ఇదే విషయంపై తనదైన స్టైల్లో స్పంధించింది సింగర్ చిన్మయి..పలువురి ప్రముఖులకు ఘాటు కౌంటర్ వేసింది. మామూలుగానే ఇలాంటి విషయాల్లో చిన్మయి ముందుంటారు. స్త్రీలు, పురుషులు అనే తేడా వచ్చిన, లింగ వివక్ష కనిపించినా కూడా చిన్మయి తన స్టైల్లో కౌంటర్లు వేస్తుంటారు. అలా సుధా కొంగర చెప్పిన మాటలకు తన శైలిని జోడించి మరీ కౌంటర్ వేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందిస్తూ..“సినిమా దర్శకులు..నటులు, సంగీత దర్శకులు, క్రియేటర్స్, లాయర్స్, డాక్టర్స్, పొలిటిషియన్స్ భార్యలు నిజాంగానే గ్రేట్.. మీరు మీ భర్తలకు పని చేసుకునే స్వేచ్చను, పర్మిషన్ ఇచ్చారు ” అంటూ సెటైర్ వేసింది. ఇక సింగర్ చిన్మయి పోస్టుకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news