Moviesబ‌న్నీతో అలాంటి ప‌ని చేయ‌లేదు..ఈసారి చేస్తా అంటున్న అనసూయ‌!

బ‌న్నీతో అలాంటి ప‌ని చేయ‌లేదు..ఈసారి చేస్తా అంటున్న అనసూయ‌!

హాట్ యాంక‌ర్‌గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా బుల్లితెర‌పై అల‌రిస్తూనే.. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వెండితెర‌పై కూడా మెరుస్తోంది. ఇటీవ‌లె `పుష్ప‌` వంటి పాన్ ఇండియా సినిమాలో దాక్షాయణిగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా బ్యాన‌ర్ల‌పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 17న విడుద‌లై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో దాక్షాయణిగా న‌టించిన అన‌సూయ‌కు మాత్రం మంచి మార్కులే ప‌డ్డాయి.

ఇక‌పోతే టీవీ షోలు, సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌కి పిచ్చెక్కిస్తుంటుంది. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నా..పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తూ హీరోయిన్లకు తాను కూడా ఏం తక్కువ కాదని నిరూపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా అన‌సూయ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌ట్లు పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఓ వ్య‌క్తి పుష్ప షూటింగ్ స‌మ‌యంలో అల్లు అర్జున్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేయ‌మ‌ని కోరాడు.

అందుకు అన‌సూయ బ‌దులిస్తూ.. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీతో సెల్ఫీనే దిగ‌లేదు. అస‌లు అలాంటి ఆలోచ‌నే రాలేదు. కానీ, ఈ సారి సెట్స్‌లో ఆయ‌న‌తో ఫొటో దిగి మీ కోసం షేర్ చేస్తా అంటూ చెప్పుకొచ్చింది. కాగా, అన‌సూయ ప్ర‌స్తుతం పుష్ప‌2 తో పాటు పక్కా కమర్షియల్, రంగ‌ మార్తాండ, ఖిలాడి చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తోంది. అలాగే త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఈమె ప‌లు సినిమాలకు సైన్ చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news