Movies' పుష్ప ' లేటెస్ట్ వ‌సూళ్లు ఇవే... బ‌న్నీ ర్యాంప్ ఆడుతున్నాడుగా...!

‘ పుష్ప ‘ లేటెస్ట్ వ‌సూళ్లు ఇవే… బ‌న్నీ ర్యాంప్ ఆడుతున్నాడుగా…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా – నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్‌గా, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా పుష్ప‌. శేషాచ‌లం అడ‌వుల్లోని గంధ‌పుచెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఓ మోస్త‌రు టాక్‌తో కూడా వ‌సూళ్ల వీరంగం ఆడేసింది. ఇప్ప‌టికే స‌క్సెస్ ఫుల్‌గా ఫ‌స్ట్ వీక్ కంప్లీట్ చేసుకున్న పుష్ప ఇప్పుడు రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా చూస్తే ఐకాన్ స్టార్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

తొలి రెండు రోజుల్లోనే రు. 100 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టిన పుష్ప ఫ‌స్ట్ వీక్ ముగిసే స‌రికి ఓవ‌రాల్‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 229 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ఏపీలో టిక్కెట్ల రేట్లు త‌గ్గించేయ‌డం, బెనిఫిట్ షోలు, అద‌న‌పు షోలు లేక‌పోవ‌డం, మ‌రోవైపు థియేట‌ర్ల‌పై వ‌రుస దాడుల‌తో చాలా థియేటర్లు మూసివేసినా కూడా పుష్ప ఈరేంజ్‌లో వ‌సూళ్లు సాధించింది. ఇవి కూడా స‌క్ర‌మంగా ఉండి ఉంటే పుష్ప రికార్డులు మ‌రో స్థాయిలో ఉండేవ‌ని చెపుతున్నారు.

ఏదేమైనా సినిమాకు యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా బ‌న్నీ ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్టాడంటే బ‌న్నీ స్టామినా ఏంటో తెలుస్తోంది. ఇక నైజాంలో పుష్ప షేర్ రు. 35 కోట్ల‌కు చేరువ అవుతోంది. ఓవ‌ర్సీస్‌లో పుష్ప 2 మిలియ‌న్ల మార్క్ క్రాస్ చేసింది. మ‌రి ఆర్ ఆర్ వ‌చ్చే వ‌ర‌కు పుష్ప‌కు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద పోటీ లేదు. మ‌రి ఫైన‌ల్ ర‌న్‌లో ఈ సినిమా ఇంకెన్ని వ‌సూళ్లు సాధిస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news