Moviesతార‌క్ - కొర‌టాల శివ సినిమా నుంచి కియారా అవుట్‌.. ఆ...

తార‌క్ – కొర‌టాల శివ సినిమా నుంచి కియారా అవుట్‌.. ఆ హీరోయిన్ ఫిక్స్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్‌ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. 14 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాపై ఆకాశాన్ని అందుతున్న‌ అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మరో క్రేజీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. దీనికితోడు బాహుబలి 2 సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ల‌లో ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఎన్టీఆర్… కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ కూడా దాదాపు ఫైనలైజ్ అయింది. ప్రస్తుతం కొర‌టాల టీం నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా ఎవరిని ఎంపిక చేయాలి అన్న దానిపై ఇప్పటికే మూడు నాలుగు పేర్లు తెరమీదకు తీసుకువచ్చారు. కొరటాల శివ – మహేష్ బాబు కాంబోలో వ‌చ్చిన‌ భరత్ అనే నేను సినిమాలో నటించిన కియారా అద్వానీని ఎంపిక చేశారని ఇప్పటివరకు ప్రచారం జరిగింది. కొరటాల కూడా ముందుగా ఆమె వైపే మొగ్గు చూపారని ఇండస్ట్రీలో లీకులు వచ్చాయి. అయితే ఇప్పుడు కైరా అద్వాని ప్లేస్ లో సమంతను తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో సమంత ఫైనలైజ్ అయితే ఎన్టీఆర్ తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవటం ఐదోసారి అవుతుంది. గతంలో సమంత – ఎన్టీఆర్ కలిసి రామయ్యవస్తావయ్యా – బృందావనం – ర‌భ‌స – జనతా గ్యారేజ్ సినిమాల్లో నటించారు. ఈ నాలుగు సినిమాల్లో జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అవగా బృందావనం యావరేజ్. మరో రెండు సినిమాలు అంచనాలు అందుకోలేక పోయాయి. అయితే జనతాగ్యారేజ్ దర్శకుడు కొరటాల శివ.ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు ఆ సెంటిమెంట్ తోనే …. తాను ఎన్టీఆర్ తో తెరకెక్కించే సినిమాకు కథాపరంగా సమంత బాగా యాప్ట్ అవుతుందని ఆమెతో సంప్రదింపులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సమంత తాజాగా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో ఎలా ఫామ్ లోకి వచ్చిందో చూశాం. ఇప్పుడు వరుస పెట్టి క్రేజీ ఆఫర్లతో ఆమె ఛాన్సులు కొట్టేస్తోంది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ తో ఆమె ఒక సినిమా చేస్తే… మళ్లీ మూడు నాలుగు సంవత్సరాలు ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news