Moviesఆ డైరెక్ట‌ర్‌పై ష‌కీలా షాకింగ్ కామెంట్స్‌

ఆ డైరెక్ట‌ర్‌పై ష‌కీలా షాకింగ్ కామెంట్స్‌

సౌత్ ఇండియాలో రెండు దశాబ్దాల క్రితం శృంగార తార షకీలా తన సినిమాలతో ఒక ఊపేశారు. మలయాళంలో ఆమె నటించిన శృంగార సినిమాలు సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ రిలీజ్ అయ్యాయి. ఆ టైం లోనే ఆమెకు యూత్ తిరుగు లేని క్రేజ్ వచ్చేసింది. ఇంకా చెప్పాలంటే మలయాళంలో ఆమె నటించిన శృంగార సినిమాలు హిందీ భాషల్లో కూడా డ‌బ్‌ అయ్యాయి. అప్పట్లో షకీలా నటించిన సినిమా వారానికి ఒకటి రిలీజ్ అయ్యేది. చివరకు మలయాళంలో పెద్ద హీరోల సినిమాలకు మించి షకీలా సినిమాలకు వసూళ్లు రావడంతో ఆ స్టార్ హీరోలు కూడా ష‌కీలాను టార్గెట్ చేశారు.

దీంతో వారు షకీలా సినిమాలపై నిషేధం విధించడంతో పాటు… ఆమె సినిమాలు రిలీజ్ కాకుండా పెద్ద హీరోలు సైతం అడ్డుపడిన సంఘటనలు ఉన్నాయి. దీనిని బ‌ట్టే ఆమెకు ఎలాంటి క్రేజ్‌ వచ్చిందో అర్థం అవుతోంది. ఆమె నటించిన కొన్ని శృంగార సినిమాలు విదేశీ భాషల్లోకి కూడా డబ్ అయ్యాయి. 2003 తర్వాత ఆమె శృంగార సినిమాలకు దూరంగా ఉంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. రెండు దశాబ్దాల నుంచి ఆమె నటిగా బిజీగా ఉన్నారు. షకీలా ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అయితే ఆమె తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారట. షకీలా జీవిత చరిత్ర ఆధారంగా షకీలా పేరుతో తెరకెక్కిన సినిమా కూడా గత ఏడాది రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజైన షకీలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇంద్ర‌జిత్ లంకేష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే షకీలా తన తాజా ఇంటర్వ్యూలో తాను చాలా మందిని గుడ్డిగా నమ్మి మోసపోయాను అని చెప్పారు.

తన దగ్గరకు వచ్చిన సినిమా దర్శకులు కానీ… బంధువులు కానీ నమ్మదగిన వారు కాదని ఆమె వాపోయారు. తన బంధువులు తన దగ్గర ఆర్థికంగా సహాయం పొందిన తర్వాత మోసం చేశారని షకీలా వాపోయింది. ఇక షకీలా సినిమా తెరకెక్కించిన దర్శకుడు ఇంద్రజిత్ సినిమాకు ముందు తనను కలిసి చాలా విషయాల గురించి చర్చించారని తెలిపింది. అయితే ఆ తర్వాత ఆయన కథను తన ఇష్టానుసారం మార్చేశాడు అని కామెంట్ చేసింది.

ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాన‌ని… అయితే ఇది బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింద‌ని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రస్తుతం ఓ క‌న్న‌డ‌ సినిమాలో నటిస్తున్నానని చెప్పింది. ఇక తెలుగులో తనకు ఇటీవల ఆఫర్లు రావడం లేదని చెప్పింది. షకీలా ఎన్ని సినిమాల్లో నటించినా ఆర్థికంగా మాత్రం స్థిరపడ్డ లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news