Moviesబిగ్‌బాస్ హిమ‌జ‌ను హ‌ర్ట్ చేసింది ఎవ‌రు...!

బిగ్‌బాస్ హిమ‌జ‌ను హ‌ర్ట్ చేసింది ఎవ‌రు…!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న న‌టి హిమ‌జ‌. సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాల్లో నటించిన హిమ‌జ‌కు బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా పాపులారిటీ పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చాక ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె ఓ టాప్‌ సెలబ్రిటీ అయిపోయింది. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్స్‌లో వ‌రుస‌గా ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలాగే ఆమె పాపులారిటీ కూడా రోజు రోజుకు పెరుగుతోంది.

ముఖ్యంగా హిమ‌జ‌ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఆమె లైఫ్ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కేవలం సీరియల్ ఆర్టిస్ట్ గా ఉన్న ఆమెకు ఖరీదైన ప్లాట్లు, లగ్జరీ కార్లు ఎలా వచ్చాయని కొంద‌రు నెటిజ‌న్లు రకరకాల సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటిపై ఆమె స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు తన‌పై ఎందుకు వస్తాయో ? అర్థం కావడం లేదని… అవి చూసినప్పుడు తనకు చాలా బాధ అనిపిస్తుంది అని వచ్చింది.

 

ఇలాంటి వ్యాఖ్యలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని చెప్పింది. తన కారుతో పాటు తన ఇంటికి సంబంధించిన ఈఎంఐ డాక్యుమెంట్లు లైవ్‌లోకి వ‌చ్చి చూపించాలి అనుకుంటున్నా అని కూడా చెప్పింది.
తాను సినిమాల్లో నటిస్తుండడంతో పాటు సీరియల్స్ కూడా చేస్తున్న‌ప్పుడు ఓ ప్లాట్… ఓ కారు కూడా ఉండకూడ‌దా ? అని ప్రశ్నించింది.

ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న తనకు ఎందుకు ఈఎంఐలు ఇవ్వ‌రా అని నెటిజ‌న్ల‌కు ఎదురు ప్రశ్న వేసింది. సోషల్ మీడియాలో కొందరు తన గురించి ఇలాంటి చెత్త‌ కామెంట్లు చేస్తారని… వారు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news