Moviesతొలి అనుభ‌వం షేర్ చేసుకోమ‌న్న నెటిజ‌న్‌.. అనుప‌మ రిప్లే చూడండి..!

తొలి అనుభ‌వం షేర్ చేసుకోమ‌న్న నెటిజ‌న్‌.. అనుప‌మ రిప్లే చూడండి..!

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు ఈ పేరు గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. తెలుగులో వ‌రుస హిట్ల‌తో దూసుకుపోయిన అనుప‌మ మ‌ధ్య‌లో కాస్త స్లో అయినా కూడా మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే ఛాన్సులు అందుకుంటోంది. ఒకానొక టైంలో ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంద‌నే అంద‌రూ అనుకున్నారు. అయితే క‌థ‌ల ఎంపిక‌లో ఆమె జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం ఆమెకు మైన‌స్ అయ్యింది.

ఇక సోష‌ల్ మీడియాలో… ముఖ్యంగా ఇన్‌స్టా గ్రామ్‌లో ఆమెకు మామూలు పాపులారిటీ ఉండ‌దు. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ అదిరిపోయే అంద చందాల‌తో అనుప‌మ కుర్రకారును రెచ్చ‌గొడుతూనే ఉంటుంది. అలాగే అప్పుడ‌ప్పుడు త‌న ఫాలోయిర్స్‌తో చిట్ చాట్ కూడా చేస్తుంది. ఈ క్ర‌మంలోనే అనుప‌మ‌ను కొంద‌రు బోల్డ్ ప్ర‌శ్న‌ల‌తో రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ కూడా ఇస్తుంటుంది.

ఈ క్ర‌మంలోనే తాజాగా చేసిన చిట్‌చాట్‌లో ఓ నెటిజ‌న్‌ను అనుప‌మ‌ను మీ ఆడిష‌న్స్ తొలి అనుభ‌వం చెప్ప‌మ‌ని అడిగాడు. దీంతో ఆమె త‌న తొలి ఆడిష‌న్ గుర్తు చేసుకుని చాలా నెర్వ‌స్‌గా ఫీల్ అవుతాన‌ని ఆన్స‌ర్ ఇచ్చింది. ఇక 18 పేజీస్ సినిమా గురించి అడ‌గ‌గా… ఈ సారి త‌న బ‌ర్త్ డే కూడా చాలా స్సెష‌ల్ అని 18 18 అని చెప్పింది.

ఇక తెలుగు, త‌మిళ్ రెండిట్లో ఏ భాష ఇష్ట‌మ‌ని అడిగితే… త‌న‌కు క‌న్నుల‌తో మాట్లాడే భాష అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పింది. హీరో రామ్ త‌న‌కు ఫేవ‌రెట్ ఫ్రెండ్ అని చెప్పింది. ఇక అనుప‌మ ప్ర‌స్తుతం దిల్ రాజు బ్యాన‌ర్లో రౌడీ బాయ్స్ సినిమాతో పాటు నిఖిల్ కార్తీకేయ 2, గీతా ఆర్ట్స్ 18 పేజీస్ సినిమాల్లో కూడా న‌టిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news