Moviesఆయనతో తమన్నా రొమాన్స్.. కెరీర్ లోనే బెస్ట్ ప్యాకేజ్..!!

ఆయనతో తమన్నా రొమాన్స్.. కెరీర్ లోనే బెస్ట్ ప్యాకేజ్..!!

ప్రస్తుతం తమన్నా హవా సినీ ఇండస్ట్రీలో తగ్గిందనే చెప్పాలి. ఒక్కప్పుడు ఖణం తీరిక లేకుండా వరుస సినిమాలు చేస్తు.. అటు స్టార్ హీరోలతోను..ఇటు కుర్ర హీరోలతోను చిందులేసిన ఈ మిల్కీ బ్యూటీని..ఇప్పుడు టాప్ హీరోలు పట్టించుకోవడమే మానేసారు. ఈ రంగుల ప్రపంచం లో అంతే..కొత్త హీరోయిన్స్ అందలు ఆరబోస్తున్నప్పుడు.. పాత అమదాలు ఆడియన్స్ కి అంతగా కంటికి ఆనవుగా.

రోజుకో కొత్త హీరోయిన్స్..తెర పై అందాల జాతర చేస్తుంటే..తమన్నా ఎంత హాట్ గా కనిపించినా ప్రేక్షకులు ఆమె వైపు చూడటం లేదు. దీంతో డైరెక్టర్స్ కూడా ఆమె ను సినిమాలో పెట్టుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూయించట్లెదనే టాక్ వినిపిస్తుంది. లేకపోతే బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తరువాత కూడా అమ్మడు కాల్ షీట్స్ ఖాళీగా ఉన్నయంటేనే ఆమె పరిస్ధితి ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ సరసన F3 మూవీ చేస్తున్న ఈ బ్యూటీ, రీసెంట్‌గా చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది. మెగాస్టార్ హీరోగా రూపొందుతున్న ‘భోళా శంకర్’ సినిమాలో ఆయనతో రొమాన్స్ చేయబోతోంది తమన్నా. తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి కి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నాను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. అంతేకాదు, ఈ చిత్రంలో నటించినందుకు గాను ఆమెకు భారీ పారితోషికం ఇస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. ‘భోళా శంకర్‌’ కోసం ఆమె దాదాపు 3 కోట్లు తీసుకుంటోందట. ఇప్పటికే ఇందులో సగం అడ్వాన్స్‌గా ఆమె ఖాతాలోకి వెళ్లిందని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇది ఆమె కెరీర్ లోనే బెస్ట్ ప్యాకేజ్ అవుతుంది.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news