Movies' పెద్ద‌న్న ' ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌.. సూప‌ర్...

‘ పెద్ద‌న్న ‘ ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌.. సూప‌ర్ స్టార్ ప‌వ‌ర్ ఇంతేనా..!

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా సిరుత్తై శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా పెద్ద‌న్న.. లేడీ సూప‌ర్ స్టార్ నయనతార హీరోయిన్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్లు ఖుష్బూ , మీనా కూడా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక కీర్తి సురేష్ ర‌జ‌నీకాంత్ ప్రియ‌మైన చెల్లిగా ఈ సినిమాలో న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్ లాంటి కీల‌క న‌టులు కూడా న‌టించ‌డంతో పెద్ద‌న్న‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రోవైపు మాస్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో తిరుగులేని హీరోగా వ‌చ్చిన శివ తొలిసారిగా ర‌జ‌నీకాంత్‌తో డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో పాటు టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెంచేశాయి. ఇక తెలుగులో అగ్ర నిర్మాత సురేష్‌బాబు ఈ సినిమాను విడుద‌ల చేశారు. ఇక పెద్ద‌న్న తెలుగులో ఏకంగా రు. 12.5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

అయితే సినిమాకు డిజాస్ట‌ర్ టాక్ రావ‌డంతో తొలి రోజు వ‌సూళ్లు తేలిపోయాయి. తొలి రోజు పెద్ద‌న్న‌కు కేవ‌లం రు 1.63 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌చ్చింది. ఇప్ప‌టికే వ‌రుస ప్లాపుల‌తో తెలుగులో ర‌జ‌నీ మార్కెట్ ప‌డిపోయింది. ఇంకా చెప్పాలంటే ర‌జ‌నీ సినిమాల‌కు ఫ్యామిలీ ఆడియెన్స్ రావ‌డం ఎప్పుడో త‌గ్గిపోయింది. ఇక తాజా వ‌సూళ్ల‌తో పెద్ద‌న్న బ‌య్య‌ర్ల‌కు భారీ న‌ష్టాలు మిగ‌ల్చ‌నుంది. ఇక పెద్ద‌న్న తొలి రోజు ఏరియా వైజ్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 0.53 cr
సీడెడ్ – 0.24 cr
ఉత్తరాంధ్ర – 0.16 cr
ఈస్ట్ – 0.12 cr
వెస్ట్ – 0.09 cr
గుంటూరు – 0.25 cr
కృష్ణా – 0.13 cr
నెల్లూరు – 0.11 cr
===================
ఏపీ + తెలంగాణ = 1.63 cr
====================

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news