Movies‘మా’ ఎన్నికల్లో ఓటు వేయని ఆ స్టార్‌ హీరోలు.. అసలు ఏమైందంటే..?

‘మా’ ఎన్నికల్లో ఓటు వేయని ఆ స్టార్‌ హీరోలు.. అసలు ఏమైందంటే..?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరు మాట్లాడుకునే అంశం ఒక్కటే. అదే మా ఎన్నికలు. కేవ‌లం సినిమా వాళ్లే మాత్ర‌మే కాకుండా.. అటు రాజ‌కీయ నాయ‌కులు.. రెండు తెలుగు రాష్ట్రాల జ‌నాలు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోన్న మా ఎన్నికలు క్లైమాక్స్‏కు చేరుకున్నాయి. మా ఎన్నికలు రసాభాసగా జరుగుతున్నాయి. ఇరు ప్యానల్ సభ్యుల మధ్య వాగ్వాదాలు, తోపులాట చోటు చేసుకున్నాయి.

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఈ రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ మ‌య్యాయి. పోలింగ్ కేంద్రంలో నరేష్, ప్రకాష్ రాజ్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేయడంపై మంచు విష్ణు ప్యానల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంచి విష్ణు ఫ్యానల్ లో యాక్టివ్ గా ఉండే సివ బాలాజీ చెయ్యిని కొరికేసింది..సీనియర్ నటి హేమ. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇక ఫిల్మ్ న‌గ‌ర్ లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్లో మూడు గ‌దుల్లో మా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్ లో ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ఓట్లేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం 2 గంటలకు ముగియనున్న సంగతి తెలీసందే. ఇంకా ఇంకా రెండున్న గంటల సమయం మాత్రమే ఉన్నా కూడా పలువురు స్తార్ హీరోలు ఓటు వేయ్యడానికి ముందుకు రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది..

అయితే ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఓటు వేయిన హీరోలు.. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, వెంకటేష్, నాగార్జున, నాగ చైతన్య, వరుణ్ తేజ్, రానాలు ఉన్నారు. ప్రస్తుత పరిస్ధితులు చూస్తుంటే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news