Moviesశివ‌బాలాజీ నా పై చేయి వేసి... అందుకే కొరికానంటూ హేమ సంచ‌ల‌నం

శివ‌బాలాజీ నా పై చేయి వేసి… అందుకే కొరికానంటూ హేమ సంచ‌ల‌నం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ప్ర‌చారంలో ఎంత వాడీవేడిగా జ‌రిగాయో ఈ రోజు ఎన్నిక‌ల్లోనూ అంతే వాడీవేడీగా జ‌రుగుతున్నాయి. ఇక పోలింగ్ వేళ ప్ర‌కాష్‌రాజ్ ఫ్యానెల్ రిగ్గింగ్ చేస్తోంద‌ని మంచు విష్ణు ఫ్యానెల్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. ఇక మోహ‌న్‌బాబు అరుపుల‌పై ఎన్నిక‌ల అధికారులు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇక ప్ర‌కాష్‌రాజ్ ఫ్యానెల్ నుంచి పోటీ చేస్తోన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ.. విటు విష్ణు ఫ్యానెల్లో ఉన్న శివ‌బాలాజీ చేయి కొరికిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే న‌రేష్ కూడా దీనిపై స్పందించారు. మిగిలిన వారు కూడా హేమ చేయి కొర‌క‌డంపై స్పందిస్తున్నారు. దీనిపై స్పందించిన హేమ తాను వెళుతుంటే శివ‌బాలాజీ చేయి అడ్డుగా పెట్టాడ‌ని.. అక్క‌డితో ఆగ‌కుండా న‌న్ను ట‌చ్ చేయాల‌ని చూశాడ‌ని.. అందుకే తాను చేయి కొరికానంటూ మండిప‌డ్డారు. అంత‌కు మించి దాని వెన‌క ఎలాంటి దురుద్దేశం లేద‌న్నారు. ఇక బెన‌ర్జీకి త‌న‌కు ఎలాంటి గొడ‌వ జ‌ర‌గ‌లేద‌ని శివ‌బాలాజీ చెప్పారు. అంత‌కు ముందే బెన‌ర్జీని చంపేస్తానంటూ మోహ‌న్‌బాబు వార్నింగ్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news