Moviesవైష్ణ‌వ్ తేజ్ కొండ‌పొలంకు ' మెగాస్టార్ ' రివ్యూ ఇదే..

వైష్ణ‌వ్ తేజ్ కొండ‌పొలంకు ‘ మెగాస్టార్ ‘ రివ్యూ ఇదే..

మెగా హీరో వైష్ష‌వ్ తేజ్ త‌న తొలి సినిమా ఉప్పెన‌తో సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. సానా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఉప్పెన ఎలాంటి అంచ‌నాలు లేకుండా రు. 50 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టి సెన్షేష‌న‌ల్ అయ్యింది. ఇక ఇప్పుడు త‌న రెండో సినిమాగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో కొండ‌పొలం సినిమా చేశాడు. క్రేజీ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్‌సింగ్ వైష్ణ‌వ్‌కు జంట‌గా న‌టించిన ఈ సినిమాను ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాయిబాబు జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు.

ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న ఈ సినిమా పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా ప్రీమియ‌ర్ షో చూసిన మెగాస్టార్ చిరంజీవి సినిమా యూనిట్‌పై ప్ర‌శంస‌లు గుప్పించారు. కొండ‌పొలం సినిమా ఇప్పుడే చేశాన‌ని.. ప‌వ‌ర్ ఫుల్ సందేశంతో కూడుకున్న అంద‌మైన గ్రామీణ ప్రేమ‌క‌థ‌గా ద‌ర్శ‌కుడు క్రిష్ బాగా తెర‌కెక్కించార‌ని ప్ర‌శంసించారు.

ఎప్పుడూ కూడా మంచి వైవిధ్యం ఉన్న క‌థ‌లు ఎంచుకుని.. న‌టీన‌టుల నుంచి కూడా అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న రాబ‌ట్ట‌గ‌ల స‌త్తా క్రిష్ సొంతం అని చిరు కితాబు ఇచ్చారు. ఈ సినిమా ఎంతో మంది ప్ర‌శంస‌ల‌తో పాటు, ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంటుంద‌ని చిరు ట్విట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాకు చిరు నుంచి పాజిటివ్ ఫ్యీడ్ బ్యాక్ రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news