Moviesమ‌హేష్‌ను బెదిరించిన ప్ర‌తిసారి న‌మ్ర‌త అలా చేసేదా...!

మ‌హేష్‌ను బెదిరించిన ప్ర‌తిసారి న‌మ్ర‌త అలా చేసేదా…!

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోనే మోస్ట్ రొమాంటిక్ క‌పుల్‌గా గుర్తింపు పొందిన అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత విడాకుల వ్య‌వ‌హారం రెండు రోజులు తెలుగు మీడియాను, సోష‌ల్ మీడియాను కుదిపేసింది. ఇప్పుడిప్పుడే ఈ వార్త‌లు కాస్త చ‌ల్ల‌బ‌డుతున్నాయి. ఈ విడాకుల వార్త‌ల‌పై ఎవ‌రికి తోచిన‌ట్టుగా వారు చ‌ర్చించుకున్నారు. అయితే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కొంద‌రు స్టార్ హీరోల ఫ్యామిలీలో విబేధాల గురించి కూడా చ‌ర్చించుకోవ‌డం ఆస‌క్తిక‌ర విష‌య‌మే.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – ఆయ‌న భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌ది కూడా ప్రేమ వివాహ‌మే. నాలుగేళ్లు ప్రేమించుకున్న వీరు 2005లో పెళ్లి చేసుకున్నారు. అప్ప‌ట్లో వీరి పెళ్లి ఇటు కృష్ణ ఫ్యామిలీకి ఇష్టం లేద‌నే అంటారు. ముందు ముంబైలో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాక త‌ర్వాత మ‌రోసారి పెద్ద‌ల‌ను ఒప్పించి రెండోసారి కూడా న‌మ్ర‌త‌ను పెళ్లి చేసుకున్నాడు మ‌హేష్‌. అప్ప‌ట్లో మ‌హేష్ త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ను ఒప్పించే విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు కూడా జ‌రిగాయ‌ట‌.

 

న‌మ్ర‌త మ‌హేష్‌పై అలిగిన ప్ర‌తిసారి ముంబై వెళ్లిపోయేద‌ట‌. అయితే మ‌హేష్‌కు వివాహ వ్య‌వ‌స్థ‌పై ఎంత గౌర‌వ‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. న‌మ్ర‌త బెదిరించిన ప్ర‌తిసారి తానే ఓ మెట్టు త‌గ్గి ఆమెను క‌న్విన్స్ చేసి హైద‌రాబాద్‌కు ర‌ప్పించేవాడ‌ట‌. అయితే ఈ గ‌డ‌వ‌ల్లోనే వారు మ‌రింత ప్రేమ‌తో ఒక‌రికి ఒక‌రు ద‌గ్గ‌ర‌య్యే వార‌ట‌. ఇక ఇప్పుడు మ‌హేష్ – న‌మ్ర‌త ఇండ‌స్ట్రీలోనే బెస్ట్ క్యూట్ జోడీగా ఎంత పాపుల‌ర్ అయ్యారో తెలిసిందే…!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news