MoviesMaa Elections: షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్..!!

Maa Elections: షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్..!!

ఈ ఏడాది మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్(MAA) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అక్టోబర్ 10వ తేదీన మా ఎన్నికలు జరగనుండగా..ఒక పక్క ప్రకాష్ రాజ్, మరొక పక్క మంచు విష్ణు లు మా అధ్యక్ష పదవి కోసం, మా అసోసియేష్ లో సమస్యల పరిష్కారం కోసం పోటీ చేస్తున్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ప్రధానం గా వీరి మధ్యన గట్టి పోటీ ఉందని చెప్పాలి.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి ముందుగా మద్దతు ఇచ్చిన బండ్ల గణేష్, ఆ తర్వత జనరల్ సెక్రెటరీ నామినేషన్ వేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. జనరల్ సెక్రటరీగా తనను ఎన్నుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా వినూత్న ప్రచారానికి తెర తీశారు బండ్ల గణేష్. అయితే ఇప్పుడు అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ట్విట్టర్‌లో స్పష్టం చేశారు.

తన దైవ సమానులు, తన ఆత్మీయులు, తన శ్రేయోభిలాషుల సూచన మేరకు తన జనరల్ సెక్రెటరీ నామినేషన్ ను ఉపసంహరించుకున్నట్లు బండ్ల గణేష్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాక ఉపసంహరణ కి సంబంధించిన పత్రం ను సైతం పోస్ట్ చేశారు బండ్ల గణేష్. శ్రీకాంత్ మరియు ప్రకాష్ రాజ్ లతో ఫోటో ను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

 

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news