Moviesఇరగదీసాడు భయ్యా..అందరిని ఆకట్టుకుంటున్న “బలమెవ్వడు” టీజర్..!!

ఇరగదీసాడు భయ్యా..అందరిని ఆకట్టుకుంటున్న “బలమెవ్వడు” టీజర్..!!

ఇప్పుడు ప్రజలు పెద్ద హీరోనా..చిన్న హీరోనా..?? ఏ డైరెక్టర్ ఈ సినిమా తీస్తున్నాడు..?? హీరోయిన్ ఎవరు ..? అని ఆలోచించట్లేదు. కధ నచ్చిందా.. సినిమా చూసి నవ్వుకున్నామా..అంతే. ఏ హీరో అయినా సమానంగా ఆదరిస్తున్నారు ప్రెక్షకులు. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు అన్నీ బ్యాలెన్స్ చేస్తూ..చిన్న సినిమాలను బ్లాక్ బస్టర్ హిట్స్ గా బాక్స్ ఆఫీస్ ముందు నిలబెడుతున్నారు.

ఈ క్రమంలోనే ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న సినిమా ‘బలమెవ్వడు’. ప్రస్తుతం సమాజంలో వైద్యరంగం ఎంత కమర్షియల్ అయిపోయిందో మనకు తెలిసిందే. వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించడానికి మన ముందుకు వస్తుంది ‘బలమెవ్వడు’. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సుహాసిని మణిరత్నం, బబ్లూ పృథ్వీరాజ్ మరియు నాసర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణి శర్మ సంగీతం. సత్య రాచకొండ దర్శకత్వం వహించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. టీజర్‌ను చూస్తుంటే లవ్ అండ్ మెడికల్ క్రైమ్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. రిస్క్ తీసుకోకపోతే లైఫ్‌లో మిగిలేది రస్క్ మాత్రమే అన్న డైలాగ్ ఆకట్టుకుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోన్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే రిలీజ్‌డేట్‌ను అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాత ఆర్‌.బి.మార్కండేయులు తెలిపారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news