Moviesకెరీర్‌లోనే ఫస్ట్ టైం అలా చేస్తున్న పూజా.. తెలివితేటలు మాములుగా లేవుగా..??

కెరీర్‌లోనే ఫస్ట్ టైం అలా చేస్తున్న పూజా.. తెలివితేటలు మాములుగా లేవుగా..??

పూజా హెగ్డే.. టాలివుడ్ బుట్టబోమ్మ. 2014 లో ముకుంద అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ.. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కొట్టడానికి చాలా టైం తీసుకుంది. కానీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే పూజా హెగ్డే అని మరో అనుమానం లేకుండా చెప్తున్నారు. కన్నడ భామ పూజా హెగ్డే అన్ని భాషల కంటే తెలుగులోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. కెరీర్ తొలినాళ్లలో వరుస ఫ్లాపులతో సతమతమైనా ఆ తర్వాత గేర్ మార్చింది.

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. తన అందచందాలతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఇప్పుడు టాప్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు పూజా హెగ్డే తెలుగులో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు.

మరి కొద్ది రోజుల్లో ఈ భామ అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మనలని పలకరించనుంది. ఈ సినిమాలో వీరి మధ్య రొమాన్స్ హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉంది. ఎపుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. అక్టోబర్ 8న దసరా కానుకగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమాలో పూజా హెగ్డే తొలిసారి తెలుగులో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను పూజా హెగ్డే మొదలు పెట్టిందట. మరి చూడాలి అమ్మడు ఈ సినిమాలో ఎంత బాగా డబ్బింగ్ చెప్పుతుందో.. ఎలా మనలని ఆకట్టుకుంటుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news