Moviesబాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..??

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..??

అక్షయ్ కుమార్..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ బడా హీరో. ఎన్నో బ్లాక్ బస్టత్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న అక్షయ్.. సినిమాలు రికార్డుల పరంగాను, కలెక్షన్ల పరంగాను బాక్స్ ఆఫీస్ వద్ద ఎప్పుడు పోటీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయి. బాలీవుడ్ లో ప్రదాన హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తారు అక్షయ్. ఇక సంపాదన పరంగా కూడా తనకు తానే తామే అన్నట్లుగా సంపాదిస్తుంటారు. ఒక్క్ఫ్ సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతున్నారు అక్షయ్ కుమార్. అయితే సంపాదనలో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ టాప్ గా కొనసాగుతున్నాడు.

బాలీవుడ్ లో ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటారు హీరోలు.. అక్షయ్ కుమార్,షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు అయితే రెమ్యునరేషన్ తో పాటు సినిమాలలో వాటాలు కూడా తీసుకుంటారు.. ఇవే కాకుండా వారికి యాడ్ ల రూపంలో కూడా కోట్ల రూపాయలకు ఇస్తుంటారు నిర్వాహకులు.. దీంతో వారి ఆస్తులు వందల, వేల కోట్లకు పెరిగిపోయిందని చెప్పొచ్చు.. ఇటీవలే నిర్వహించిన ఓ సర్వే ప్రకారం వీరి ఆస్తులు ఇలా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఏడాదికి కనీసం నాలుగు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద అలరించే అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకు 120 కోట్లు తీసుకుంటూ ఏడాదిలో దాదాపుగా 400 కోట్ల దాకా సంపాదిస్తున్నాడట. ఇక కేవలం సినిమాల పరంగానే కాక ప్రకటనల ద్వారా కూడా అక్షయ్ భారీ మొత్తంలో అర్జీస్తున్నాడట. అక్షయ్ సంపాదనలో ఎక్కువ భాగం బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా వస్తుందట. ఇది కాకుండా అక్షయ్ కుమార్ తన సినిమాల కోసం కోట్లలో తీసుకుంటాడు. అంతేకాదు సినిమా విడుదలైన తర్వాత వచ్చే లాభం నుండి అక్షయ్ కుమార్ తన వాటాను కూడా తీసుకుంటాడు. ఇక ఇలా ఆయన సంపాదన మొత్తం చూస్తే..అక్షయ్ కుమార్ ఆస్తి విలువ అక్షరాలా 2000 కోట్ల పై మాటే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news