Moviesచిరంజీవి గొప్ప మనసు..అందుకేగా నువ్వు మెగాస్టార్ అయ్యావు సామీ..!!

చిరంజీవి గొప్ప మనసు..అందుకేగా నువ్వు మెగాస్టార్ అయ్యావు సామీ..!!

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిరంజీవి.. టాలీవుడ్ కి ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి.. స్వయం కృషితో ఎదిగిన ఒకెఒక్క స్టార్ హీరో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో మన చిరంజీవి. హీరోగా అడుగు పెట్టినా .. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ కష్టఫడి ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ జనరేషన్ నటీనటులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి..

ఆయన తన స్వయంకృషితో పైకి రావడం కాదు.. తన కుటుంబం నుంచి ఎందరో నటులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాదు.. ఎక్కడైనా సరై టాలెంట్ కనిపిస్తే.. దాన్ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు చిరు. ఇప్పుడు మరోసారి ఓ యువ హీరో నటించిన సినిమాకు మెగాస్టార్ అండగా నిలిచి..అందరి దగ్గర మరోసారి శభాష్ అనిపించుకున్నారు చిరు.

ఆది పినిశెట్టి అథ్లెట్ గా నటిస్తున్న ‘క్లాప్’ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన స్నేహితుడైన రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది నటించిన ద్విభాషా చిత్రం ‘క్లాప్’ టీజర రిలీజ్ చేయటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. ఆది పినిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా.. స్పోర్ట్స్ కథతో తెరకెక్కించారు. ప్రమాదంలో కాలు కోల్పోయిన కథానాయకుడు.. కృత్రిమ కాలితో తన ఆశయాన్ని ఎల నెరవేర్చుకున్నాడు అనేదే ఈ చిత్ర స్టోరీ.త్వరలో ట్రైలర్​ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక టీజర్ చూస్తే.. ఆద్యంతం సస్పెన్స్‌తో ఆసక్తికరంగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news