Moviesవిజయ్ దేవరకొండ అన్నట్లే చేసాడుగా.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఫ్యాన్స్..!!

విజయ్ దేవరకొండ అన్నట్లే చేసాడుగా.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఫ్యాన్స్..!!

హీరో విజయ్ దేవరకొండ  ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనల్స్ సందర్భంగా ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు విజయ్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్‌’లో షణ్ముఖ ప్రియ కు ఛాన్స్ ఇచ్చాడు.

ష‌ణ్ముక ప్రియ హైద‌రాబాద్‌కు వ‌చ్చిన త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను తల్లితో స‌హా వ‌చ్చి క‌లుసుకోవ‌డం, వారితో రౌడీ హీరో ముచ్చ‌ట్ల‌కు సంబంధించిన వీడియోను ట్వట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్ కు తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

యువ గాయని​ షణ్ముఖ ప్రియకు తన సినిమాలో పాడే అవకాశమిచ్చారు విజయ్. పాట పాడటం కూడా పూర్తయిందని, త్వరలో వింటానని విజయ్ చెప్పారు. ‘లైగర్​ ప్రామిస్’ పేరుతో సోమవారం ఓ వీడియో విడుదల చేశారు.

అంతే కాదు విజయ్ మదర్ సింగర్ షణ్ముక ప్రియను సన్మానించి చీరలు, బహుమతులను అందజేశారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘లైగర్’లో అనన్య పాండే హీరోయిన్. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంతో పాటు క‌ర‌ణ్ జోహార్‌, ఛార్మిల‌తో క‌లిసి లైగ‌ర్ సినిమాను నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news