Moviesఆ టాప్ హీరో దగ్గర నుండి "చంటి" సినిమాను దొబ్బేసిన వెంకీ.....

ఆ టాప్ హీరో దగ్గర నుండి “చంటి” సినిమాను దొబ్బేసిన వెంకీ.. మెగాస్టార్ ఏం చేసారో తెలుసా..??

విక్టరీ వెంకటేష్..టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరో. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌తో పోటీ ప‌డి స‌క్సెస్‌లు అందుకుంటూ.. రికార్డులు సృష్టిస్తున్న ఏకైక హీరో. త‌న త‌రం క‌థానాయ‌కుల‌లో స‌క్సెస్ రేట్ ఎక్కువ ఉన్న స్టార్ త‌నే అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అయితే వెంక‌టేష్ సినీ కెరీర్‌లో రికార్డులు సృష్టించిన సినిమాల జాబితాలో ముందుండే చిత్రం చంటి. ఈ చిత్రంలో వెంకటేష్ స‌ర‌స‌న మీనా హీరోయిన్‌గా న‌టించింది.

 

1992 సంక్రాంతికి విడుద‌లైన చంటి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లుగా నటించిన చంటి సినిమా విడుదలై 29 సంవత్సరాలు దాటింది. ఈ సినిమాలో వెంకటేష్ కనబరిచిన నటన ఎవరూ మర్చిపోలేరు. ఈ చిత్రంలో అమాయకమైన పల్లెటూరి పిల్లాడిగా వెంకటేష్ చాలా సహజంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు.

ఈ సినిమాతో తెలుగులో విక్టరీ వెంకటేష్ స్టార్ డమ్ తెచ్చుకునీ ఓ క్రేజీ హీరోగా మారిపోయాడు. అలాగే తన నటనలో పలు రకాల హవా భావాలు వ్యక్తీ కరిస్తు ఈ సినిమా ద్వారా ఓ హీరోగా సత్తా చాటాడు. వాస్తవానికి ఈ ఛాలెంజింగ్ పాత్రకు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ను ఎంపిక చేసుకోవాలని రవిరాజా పినిశెట్టి అనుకున్నారు.

కానీ వెంకటేష్ తో సినిమా చేయవలసి వచ్చింది. ఎందుకంటే.. చినతంబీ తమిళంలో విడుదలై మంచి విజయాన్ని సాధించడంతో.. సురేష్ బాబు.. వెంకటేష్ లకు కూడా ఈ సినిమా బాగా నచ్చిందట. ఇక సురేష్ బాబు వచ్చి.. ఈ సినిమాని వెంకటేష్ తోనే చెయ్యలని పట్టుబట్టారట.. కానీ రవిరాజా పినిశెట్టి అందుకు అంగీకరించలేదట. కానీ అప్పుడు సీన్ లోకి ఎంటర్ అయ్యి చిరంజీవి వచ్చి గ్ళ్మాల్ చేసి ఫైనల్ గా ఆ సినిమాని వెంకటేష్ తో చెయ్యించారట. ఇక ఆ తర్వాత ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నిజానికి ఈ పాత్రలో వెంకటేష్ కాకుండా..ఎవరు చెసినా సెట్ అయ్యి ఉండేవారు కాదనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news