Moviesఅందుకే కోదండరామిరెడ్డికి ఇచ్చిన మాటను తప్పిన బుచ్చిరెడ్డి ..?

అందుకే కోదండరామిరెడ్డికి ఇచ్చిన మాటను తప్పిన బుచ్చిరెడ్డి ..?

అప్పట్లో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు పొందిన కోదండరామిరెడ్డికి, సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉండేది. అంతేకాదు ఆయన తీసిన సినిమాలన్నీ చాలా వరకు హిట్ అవుతాయనే నమ్మకం కూడా ఉండేది. ప్రముఖ నిర్మాత బుచ్చిరెడ్డి గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో విజయవంతమైన సినిమాలను తెరకెక్కించాడు . అయితే వీరిద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు వచ్చాయట . అది కూడా అక్కినేని నాగేశ్వరరావు సినిమా విషయంలో.. అదేంటో ఇప్పుడు ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం..

నా పని అయిపోయిందనుకున్న సమయంలో 'అభిలాష' ఆదుకుంది: దర్శకుడు కోదండరామిరెడ్డిస్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు అలాగే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గోపాలకృష్ణుడు. లవ్ రొమాంటిక్ నేపథ్యంలో కొనసాగిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు డ్యుయల్ పాత్ర పోషించాడు. ఇక చాలా రోజుల తర్వాత రొమాంటిక్ క్యారెక్టర్ లో నటించడానికి అవకాశం రావడంతో, ఈయన ఎంతో హుషారుగా సినిమాలు చేయడానికి ఒప్పుకున్నాడు .అంతేకాదు డ్యూయెట్ సాంగ్స్ లో అక్కినేని నాగేశ్వర రావు ఒదిగిపోయాడు కూడా. హీరోయిన్ జయసుధ , అక్కినేని నాగేశ్వరరావుకు పోటీగా నటించింది.

Akkineni Nageswara Rao Songs || Tata Veedukolu - Buddhimanthudu - YouTube

దర్శకుడు కోదండరామిరెడ్డి , ప్రముఖ హీరో అక్కినేని నాగేశ్వర రావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అప్పట్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి బుచ్చిరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే , గోపాలకృష్ణుడు సినిమా షూటింగ్ పూర్తిగా కంప్లీట్ అవ్వకముందే , బుచ్చిరెడ్డి అక్కినేని – కోదండరామిరెడ్డి కాంబినేషన్లో మరో సినిమా వస్తున్నట్లు ప్రకటించేశారు. ఈ విషయాన్ని ఆయన అటు అక్కినేని నాగేశ్వరరావు కానీ , ఇటు కోదండరామిరెడ్డి కానీ ఎవరికీ చెప్పలేదు. ప్రకటించిన మరుసటి రోజు పేపర్ చూసిన కోదండరామిరెడ్డి ఏంటి సార్ ..? ఇది అని ప్రశ్నించగా.. అక్కినేని నాగేశ్వరరావు కు నీవు చాలా పెద్ద అభిమానివి కదా..! ఆయనతో అవకాశం వస్తే సినిమా చేయవా ఏంటి ..? అని పరాచకాలు ఆడాడు బుచ్చిరెడ్డి.

Gopala Krishnudu Full Length Telugu Movie || Akkineni Nageshwara Rao ||  Ganesh Videos - DVD Rip.. - YouTube

ఇక పోతే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా భారీ డిజాస్టర్ ను చవిచూసింది. అదే సమయంలోనే కోదండరామిరెడ్డి మరొక హీరోతో తీసిన సినిమా కూడా ఫ్లాప్ అవడంతో , బుచ్చిరెడ్డి ..అక్కినేని నాగేశ్వరరావు – కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో ప్రకటించిన సినిమాను క్యాన్సిల్ చేయడం జరిగింది. కోదండరామి రెడ్డి కి, బుచ్చి రెడ్డి ఇచ్చిన మాటను తప్పాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news