Moviesచిరంజీవిలో ఎవ్వ‌రికి తెలియ‌ని దాన‌గుణం..!

చిరంజీవిలో ఎవ్వ‌రికి తెలియ‌ని దాన‌గుణం..!

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా కొంతమంది ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు అని అప్పట్లో వార్తలు వినిపించాయి ..కానీ ప్రస్తుతం కొంతమంది సినీ పెద్దలు మాత్రం సినీ ఇండస్ట్రీలోని కార్మికులకు, ప్రజలకు కూడా తమ వంతు సహాయం చేస్తూ వస్తున్న ఏకైక వ్యక్తి చిరంజీవి అని చెప్పవచ్చు. ఇక ఈయన మన మధ్య కరోనా సమయంలో ఎంతో మందికి , ఎన్నో రకాలుగా సహాయపడినప్పటికీ కొంతమంది చిరంజీవి చేస్తున్న పనికి , అసూయపడి ఆయనపై విమర్శలు గుప్పించారు. ఏం పెద్ద చేస్తున్నాడులే ..? అన్నట్టుగా నిర్లక్ష్యంగా మాట్లాడడం కూడా మనం చూస్తూనే ఉన్నాం..

Chiranjeevi Wiki, Age, Height, Wife, Children, Family & Biography -  BigstarBio

ఇప్పుడు చెప్పబోయే ఒక వార్త వింటే మాత్రం ఇలాంటి విమర్శలు గుప్పించే వారందరి నోటికి , తాళం పడినట్లే అని చెప్పవచ్చు. ఎందుకంటే చిరంజీవి తను సంపాదించిన మొత్తం లో రోజుకు ఎంత దానం చేస్తున్నారు అనే విషయంపై ఆరా తీయగా, విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇక ఆయన ఇంటికి ఎవరైనా ఆర్థిక సహాయం కావాలంటూ వస్తే ,వారికి లక్షా రెండు లక్షలు అని చూడకుండా వారి పరిస్థితిని బట్టి చెక్ రాసి ఇస్తూ ఉంటారట. అంతేకాదు ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం ఆయన చాలామందికి నిత్యావసర సరుకులను పంపిస్తూనే, రోజుకు 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు చెక్ రూపంలో ఇస్తున్నట్లు సమాచారం.

Chiranjeevi announces free Covid vaccination for cinema workers and  journalists - Movies News

మనకు తెలిసి సినీ ఇండస్ట్రీలో ఇంత పెద్ద మొత్తాన్ని ప్రతిరోజు దానం చేయడం అంటే అది అతిశయోక్తి కాదు. కానీ చిరంజీవి మాత్రం పేదలను దృష్టిలో పెట్టుకుని , తను సంపాదించిన డబ్బులు ప్రతి రోజు ఇలా దానం చేస్తూ ఉండడంతో, సినీ ఇండస్ట్రీలోని ఎంతో మంది పెద్దలు ఆయనను ఇప్పటికీ సగౌరవంగా గౌరవిస్తూనే ఉంటారు. అయితే చిరంజీవి గురించి చెడుగా మాట్లాడేవారు ఇప్పటికైనా ఈ విషయాన్ని తెలుసుకొని, తమ నోటికి తాళం వేసుకుంటే బాగుంటుంది అని ఇటీవల సినీ ప్రముఖులు కూడా అనడం గమనార్హం.

Megastar Chiranjeevi opens about alleged strained relations with Pawan  Kalyan and Allu Aravind's family : Bollywood News - Bollywood Hungama

ఏది ఏమైనా ఒక వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో దానం చేయడం అంటే అది ఎంత పెద్ద గొప్పతనమో మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత చేస్తున్నప్పటికీ చిరంజీవి ఒక సాదాసీదా మనిషిగా జీవించడం అంటే ఆయన లో ఉన్న మంచితనానికి ఇది అద్దం పడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news