Moviesఅమ్మ బాబోయ్ కాజల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. భర్త...

అమ్మ బాబోయ్ కాజల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. భర్త కోసం క్రేజీ డెసీషన్..??

టాలీవుడ్ చందమామ.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో నటనతో.. అదృష్టంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ కలువకళ్ల సుందరి. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దు గుమ్మ.. కాజల్ అగర్వాల్. తొలి సినిమా అంతగా హిట్‌ కానప్పటికీ. ఈ అమ్మడు ఆ తర్వాత నటించిన ‘చందమామ’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

అనంతరం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ టాప్ హీరోయిన్ గానే రాణిస్తోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. అప్పటి నుంచి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు కాజల్. గతేడాది అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఈ జంట సూపర్ హిట్ గా ఉందంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహ‌మాడిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గ‌డుపుతుంది.

కిచ్లును వివాహం చేసుకున్న కాజల్‌ ఆ తర్వాత పెద్దగా పర్సనల్‌ లైఫ్‌కు టైమ్‌ కేటాయించకుండానే ‘ఆచార్య’ సెట్స్‌లో జాయినైపోయారు. ఆ తర్వాత భర్త గౌతమ్‌తో కలిసి కాజల్‌ ఓ స్మాల్‌ వెకేషన్‌కు వెళ్లారు. దీంతో పర్సనల్‌ లైఫ్‌కు దూరవుతున్నట్లుగా ఫీల్‌ అవుతున్నారట. ‘గౌతమ్‌ కోసం ఓ చిన్న బ్రేక్‌ తీసుకోవాలని ఉందట. ఇప్పుడు ఆ బ్రేక్‌కి కాస్త టైమ్‌ దొరికిన్నట్లు చెప్పుకొచ్చారు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news