Gossipsవావ్..ఆ యంగ్ అండ్ డైనమిక్ హిరో పక్కన..బంపర్ ఆఫర్ కొట్టేసిన వంటలక్క...

వావ్..ఆ యంగ్ అండ్ డైనమిక్ హిరో పక్కన..బంపర్ ఆఫర్ కొట్టేసిన వంటలక్క అత్త..!!

బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు వస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ వచ్చినా, తుఫాన్‌లు వచ్చినా.. భూకంపాలు వచ్చినా వంటలక్క హవా మాత్రం తగ్గటం లేదు.

కరోనా సీజన్ లోనూ ఆమె తన టీఆర్పీతో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే , అది కేవలం కార్తీకదీపం సీరియల్ మాత్రమే అని చెప్పవచ్చు. ఈ సీరియల్ మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సీరియల్‌తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాకుండా సెలబ్రిటీలకు కూడా అభిమాన సీరియల్ గా మారింది.

ఇందులో అత్త పాత్రలో నటిస్తున్న అర్చన కి కూడా ఓ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె నటనకు అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యి అభిమానులుగా మారారు. అంతేకాదు మా టీవీలో ప్రసారమవుతున్న కేరాఫ్ అనసూయ అనే మరో సీరియల్లో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు ఈ అందాల అత్తగారు.

అయితే ఈమె బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా అప్పుడప్పుడు తళ్లుకని మెరుస్తున్నారు. వెండితెర పై కూడా తన సత్తా చాటేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ధ్యాంక్యూ బ్రదర్ అనే సినిమాలో తల్లి పాత్రలో నటించింది.

అయితే ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ ఈమెను వెతుక్కుంటూ వచ్చిందని సినీ వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం.ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే .. బుల్లితెరపై అత్తగా, అమ్మగా వయసుకు మించిన పాత్రలు చేస్తున్న ఈమెకు వెండితెరపై మాత్రం ఓ యంగ్ అండ్ డైనమిక్ హీరోకి అక్కగా గ్లామరస్ గా కనిపించే అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు.

అర్చన నటిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఫ్యాన్ అయిన ఓ ప్రముఖ నిర్మాత ఈమెకు ఈ సినిమా చాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇది కనుక నిజమయితే ఈ సినిమా ఛాన్స్ ద్వారా ఖచ్చితంగా నటిగా తానేమిటో నిరూపించుకుని మరిన్ని అవకాశాలను పోందుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news