Movieskarthika deepam : షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సౌందర్య..మోనిత కి దిమ్మ...

karthika deepam : షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సౌందర్య..మోనిత కి దిమ్మ తిరిగిపోయిందోచ్..!!

బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటు వస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐపీఎల్ వచ్చినా, తుఫాన్‌లు వచ్చినా.. భూకంపాలు వచ్చినా వంటలక్క హవా మాత్రం తగ్గటం లేదు.

కరోనా సీజన్ లోనూ ఆమె తన టీఆర్పీతో దుమ్మురేపుతోంది. ముఖ్యంగా బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే , అది కేవలం కార్తీకదీపం సీరియల్ మాత్రమే అని చెప్పవచ్చు. ఈ సీరియల్ మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సీరియల్‌తో ప్రతీ ఇంటి సొంత మనిషిగా మారిపోయింది వంటలక్క గా కనిపిస్తున్న ప్రేమీ విశ్వనాథ్. తన చిరునవ్వుతోనూ తన అభినయంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాకుండా సెలబ్రిటీలకు కూడా అభిమాన సీరియల్ గా మారింది.

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న karthika deepam serial.. నేడు(2021 జూలై 7)న 1085 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.

తన సంస్కారం మీద నమ్మకం ఉందని, తను ఏ తప్పు చేయాలేదన్నదే నిజమని, అలాంటప్పుడు తానేందుకు తప్పు చేసినవాడిలా భయపడాలి అంటూ తనని తాను సమాధాన పరుచుకుంటాడు కార్తీక్‌. అలాగే తన కుటుంబమే ముఖ్యమని, తన పిల్లలు, భార్యతో సంతోషంగా ఉంటానని, అలాగే కొడుకుగా, డాక్టర్‌గా మళ్లీ తన బాధ్యతల్ని స్వీకరిస్తానని అనుకుంటాడు. ఎందుకు నన్ను నేను నిందుచుకుంటూ కుమిలిపోవాలి. నో.. నన్ను చూసి ఎవ్వరూ యావగించుకోకూడదు. అమ్మ ముందు నేను ఎప్పుడూ సుపుత్రుడిగానే నిలబడాలి.. మోనిత ముందు తలదించుకోవాల్సిన పనిలేదు.. అక్కడే నా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటున్నాను.. లేదు ఇక ముందు అలా జరకూడదు.. అంటే తప్పు చేసిన వాడిలా ఫీల్ అవ్వకూడదు.. అసలు నిజానిజాలేంటో తెలుసుకోవాలి.. ఈ కడుపు సంగతేంటో తేల్చుకోవాలి.. అని గట్టిగా నిర్ణయించుకుంటాడు కార్తిక్.

మరోవైపు మోనిత అద్దం ముందు నిలబడి.. ‘ఎంత అందంగా ఉన్నావే.. ఈ అందాన్ని చూసైనా డాక్టర్ బాబు నిన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా.. అందుకే డాక్టర్ బాబుని 16 ఏళ్లు ఎలాగూ పోయాయి.. అని ఎడ్యుకేట్ చేస్తా..’ అని అంటుంది . మధ్యలో ప్రయమణి వచ్చి ఎక్కడికి అక్కడికేనా అని అడుగుతుంది. తెలిసి ఎందుకు అడుగుతావని మోనిత అనగానే ప్రియమణి ‘మీ మంచికే చెబుతున్నాను. మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు. ఒట్టి మనిషివని కూడా చూడకుండా కొట్టి పంపిస్తారు’ అనగానే మోనిత ‘ఏడ్చారులే.. కార్తీక్‌ తప్పు చేశాడని మా అందాల అత్త నమ్ముతోంది. ఇక గుర్తు లేకపోయినా సాక్ష్యం ఉంది కాబట్టి నా కార్తీక్ నన్ను నమ్ముతున్నాడు. ఇప్పుడు వాళ్ల జుట్టు, ఆ ఇంటి గుట్టు నా చేతిలో ఉంది.. కథ మంచి రసపట్టులో ఉంది.. కాబట్టి నాకేం సమస్య లేదు’ అంటుంది తిప్పుకుంటూ.

సీన్ కట్ చేస్తే దీప మోనిత గోడ మీద గీసిన గీతలు చూస్తూ మోనిత మాటలనే గుర్తు చేసుకుంటుంది. అదే గోడ మీద మోనిత పడిపడి నువ్వడం కనిపించి.. పిడికిలి బిగించి గుద్దాలని పోతుంది. ఆగుతుంది. నిస్సహాయంగా నిరాశగా చూస్తూ తనలో తనే మథనపడుతుంది.పదేళ్ల క్రితం తన పరిస్థితి ఎలా ఉందో మళ్లీ అదే పరిస్థితి ఎందురైందని, ఇప్పుడు చేయాలని, మళ్లీ ఆజ్ఞాతంలోకి వెళ్లాలా? అయితే పిల్లల పరిస్థితి ఏంటీ? నా డాక్టర్‌ బాబు సంగతేంటి? ఆ మోనితకు వదిలేయని మనసులో అనుకుంటూ కుమిలిపోతుంది.

 

సీన్ కట్ చేస్తే.. కార్తీక్ మోనితలు రోడ్డు మీద కారులు ఆపి.. ఎదురెదురుగా నిలబడి ఉంటారు. ధర్మం ఎటు ఉందో నువ్వే ఆలోచించు.. ఇంత మాట్లాడుతున్నా నీలో మార్పు రాకుంటే న్యాయం కోసం మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అనగానే కార్తీక్‌ అమ్మలేదు.. అమెరికా వెళ్లిందని చెబుతాడు. దీంతో మోనిత షాక్‌ అవుతుంది. అమెరికా ఎందుకు వెళ్లిందనగా తన చెల్లి స్వప్న దగ్గరికి అని చెబుతాడు. దీంతో ఏదో కుట్ర జరుగుతుంది అంటూ మోనిత కంగారు పడుతుంది.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘కార్తీకదీపం’ karthika deepam కొనసాగుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news