Moviesవామ్మో..ఏందిరా అయ్య ఇది..వయస్సులో ఉన్నప్పుడు అలా చేస్తేనే బాగుంటుందట..!!

వామ్మో..ఏందిరా అయ్య ఇది..వయస్సులో ఉన్నప్పుడు అలా చేస్తేనే బాగుంటుందట..!!

రష్మి గౌతమ్.. ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడేమో..? సినిమాల్లో కూడా ఈ భామ పేరును వాడేస్తున్నారు. అంతగా క్రేజ్ తెచ్చుకుంది ఈమె. బుల్లితెర సంచలనం యాంకర్ రష్మీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బుల్లితెరపై వివిధ కార్యక్రమాల్లో తనదైన స్టైల్లో యాంకరింగ్ చేసి అతికొద్ది కాలంలోనే భారీ పాపులారిటీ తెచ్చుకుంది రష్మీ.

తన తోటి యాంకర్ సుడిగాలి సుధీర్‌నే రష్మీ పెళ్లి చేసుకోబోతోందని గతంలోనే సోషల్ మీడియా కోడై కూసింది. అందుకు కారణం ఆ ఇద్దరూ కలిసి చేసిన కార్యక్రమాల్లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడమే. ఆ ఇద్దరి మధ్య చనువు చూసి.. అది ప్రేమేనని, ఆ ఇద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారనే టాక్ అప్పట్లో జోరుగా వినిపించింది. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని ఆ ఇద్దరూ కొట్టిపారేశారు. దీంతో అప్పట్లో రష్మీ-సుధీర్ పెళ్లిపై ఊహాగానాలకు తెరపడింది.

అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యులో గ్లామర్ పాత్రలనే ఎందుకు చేస్తున్నారంటూ ఆమెను అడగగా.. దానికి రష్మి దిమ్మ తిరిగిపోయే సమాధనం ఇచ్చింది. ప్రస్తుతం అందంగా, వయస్సులో ఉన్నాం కనుక అలాంటి పాత్రలను చేస్తున్నానని..అంతేకాదు వయస్సు పైబడిన తరువాత గ్లామర్ పాత్రలను చేస్తామంటే ఎవ్వరు అంగీకరించరు కదా.. అయిన అప్పుడు అలాంటి అవకాశాలు కూడా రావని చెప్పుకొచ్చింది.

అంతే దీంతో ఒక్కసారిగా అందరు షాక్ అయ్యారు. తనకు హీరోయిన్ అవకాశాలు వచ్చినపుడు నటించడంలో తప్పేం లేదు.. డబ్బులు వస్తున్నపుడు గ్లామర్ షో చేయడంలో తప్పేం లేదని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికీ గ్లామర్ షోలో రష్మిని మించిన వాళ్లు లేరేమో అనేంతగా రచ్చ చేస్తుంది ఈ బ్యూటీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news