Moviesసినిమాలను వదిలేస్తా.. వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి..అసలు ఏమైదంటే..??

సినిమాలను వదిలేస్తా.. వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి..అసలు ఏమైదంటే..??

ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న బ్యూటీ సాయి పల్లవి. ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. ఈమె చిన్నప్పటి నుండి బెరుకు లేకుండా వేదికల మీద నాట్యం చేసేది. తెలుగు టెలివిజన్ డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది.

వైద్యవిద్య నాలుగు సంవత్సరాలు పూర్తి కాగానే తమిళ దర్శకుడు అల్ఫోన్సో ఈమెను ప్రేమమ్ చిత్రంలో నటించడానికి అవకాశంరావడంతో.. అలా ఈమె సినీ రంగ ప్రవేశం జరిగింది. సాయిపల్లవి ప్రేమమ్ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ప్రేమమ్ తెచ్చిన క్రేజ్ తో తెలుగులో ఫిదా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించి తెలుగు సినిమాకి పరిచయమయింది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని స్వంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి చలాకి నటనకు తెలుగు యువత నిజంగానే ఫిదా అయ్యారు.

ఫిదా చిత్రం తర్వాత సాయి పల్లవి క్రేజ్ టాలీవడ్‌లో అమాంతం పెరిగింది. కేవలం నటన, అభినయంతోనే సాయి పల్లవి యువతకు బాగా చేరువైంది. అందరిలా గ్లామర్ పాత్రలు చేయకున్నా సాయి పల్లవి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారడం విశేషం. మారి 2 చిత్రంలో మరోమారు తన డాన్సింగ్ స్కిల్స్ ని బయట పెట్టింది.

రౌడీ బేబీ అంటూ సాగే వీడియో సాంగ్ కు తనదైన శైలీలో డ్యాన్స్ వేస్తూ కుర్రకారుల మతిపోగొట్టింది.పాత్ర ఏదైనా సరే.. ఆ పాత్రకు ఆమె మరింత వన్నె తెస్తుంది. పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకుని.. ఆ పాత్రలో ఆమె తప్ప.. ఇంకెవరూ అలా నటించలేరు అనేలా నటించడం సాయి పల్లవి ప్రత్యేకత.

ఇక ఓ ఇంటర్వ్యుల్లో మాట్లడుతూ.. ఎప్పుడైనా ఏడ్చారా…. అని ప్రశ్నించగా… ఎన్జీకే సమయంలో చేసిన సీన్ నే పదే పదే రీషూట్ చేస్తుండేవారు ఆ సినిమా దర్శకుడు. దాంతో ఓ రోజు సినిమాలను వదిలేస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను అని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం సినిమాలో నటిస్తుంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోగా రానా నటిస్తున్నారు. సాయి పల్లవి తెలుగులో మరో సినిమాలోనూ నటిస్తుంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news