Moviesఒక్క ఐటెం సాంగ్ చేస్తే మన హీరోయిన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే.....

ఒక్క ఐటెం సాంగ్ చేస్తే మన హీరోయిన్స్ ఎంత తీసుకుంటారో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అయ్యిపోవాల్సిందే..!!

ఐటమ్ సాంగ్.. పెద్ద హీరో నుంచి చిన్న హీరో వరకు ఏ సినిమాలోనైనా ఐటమ్ సాంగ్ కామన్. సినిమా హిట్ కావాలంటే ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. అవసరం ఉన్నా లేకున్నా సినిమా 24 ఫ్రేమ్ లో ఎక్కడో ఒకచోట ఈ ఐటమ్ సాంగ్ ను ఇరికిస్తారు. ఒకప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ లు మాత్రమే ఉండేవి. నాటకాల్లో కూడా నర్తకిలుగా డ్యాన్స్ చేసేవాళ్లు. నాటకాలు పోయి సినిమాలు వచ్చేశాయి. సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్ లు దర్శనమిచ్చాయి. కానీ, ప్రత్యేకించి కొందరు నటులు మాత్రమే ఐటమ్ సాంగ్ చేసేవాళ్లు. రానురాను ఐటమ్ సాంగ్స్కు పెరిగిన క్రేజ్ తో పెద్ద హీరోయిన్లు కూడా ఐటమ్ సాంగ్ చేస్తామంటూ ముందుకోస్తున్నారు. ఐదు నిమిషాల పాటు అందాలు ఆరబోసేందుకు కోట్ల రూపాయలు రెమ్యునురేషన్ తీసుకుంటున్నారు.

ప్రతి సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉంటే సినిమా ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరించ వచ్చు. ఐటెం సాంగ్ లో ఒక స్టార్ హీరోయిన్ స్పెషల్ ఎంట్రీ ఉంటే అది సినిమాకీ కలిసొస్తుంది . దీంతో అటు దర్శక నిర్మాతలు కూడా సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటే సినిమాకు కాస్త కలిసొచ్చే అవకాశం ఉంది అని ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక ఈ ఐటమ్ సాంగ్ కు సినిమాకు కలిసొచ్చే విదంగా మంచి క్రేజ్ వున్న వాళ్ళని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ చేపిస్తున్నారు. ఐటమ్ సాంగ్స్ లో అందాల ఆరబోతతో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు కూడా అదరగొడుతున్నారు. ఇలా ప్రతి సినిమాలో ఐటెం సాంగ్స్ కి మంచి గుర్తింపు కూడా వచ్చింది.

పాత సినిమాల్లో జయమాలిని, జ్యోతిచిత్ర, సిల్క్ స్మిత వంటి ఎందరో నటీమణులు తెలుగు వెండితెరపై ఊపు ఊపేశారు. ప్రత్యేకించి ఐటమ్ సాంగ్ ల కోసమే సినిమా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కట్టే వరకు వీరీ క్రేజ్ పెరిగిపోయింది. హీరోయిన్ల కంటే వీరికే భారీ క్రేజ్ వచ్చేసింది. కనిపించేది ఐదో ఆరో నిమిషాలు మాత్రమే. ఈ ఐటమ్ తారలే సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరిపోయారు. సినిమా పరిశ్రమలో ఏ సినిమా విజయం సక్సెస్ సాధించాలన్నా, భారీ కలెక్షన్లు రాబట్టలన్నా ఐటమ్ సాంగ్ తప్పనిసరిగా పెట్టాల్సిందే. ఐటమ్ తారలకు భారీ రెమున్యురేషన్ ఇవ్వాల్సందే. అలాంటి ఐటమ్ సాంగ్స్ లో నటించే వీరు ఎంత పారితోషకం అందుకుంటారో చూద్దామా.

పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా హెబ్బా పటేల్ రెడ్ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ కి గాను ఆమె 15 లక్షల పారితోషికం అందుకుందట. బిగ్ బాస్ షో ద్వారా మంచి ఫేమ్ దక్కించుకున్న మోనాల్ అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయగా దానికి 13 లక్షల పారితోషకం అందుకుంది. యాంకర్ అనసూయ తెరమీద ఐటమ్ సాంగ్ లో తన అందాలను వెదజల్లిన కారణంగా అందుకుగాను 20 లక్షల పారితోషికం అందుకుందట. క్రాక్ సినిమా లో అందాల విందు చేసిన అప్సర రాణి 9 లక్షల రూపాయలు అందుకోగా, కాజల్, తమన్నా, శృతిహాసన్ వంటి స్టార్ రేంజ్ లో ఉన్న హీరోయిన్ లు 50 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news