Moviesఈ మేకింగ్ వీడియోలో మీరు ఇది గమనించారా..ఏదో తేడా కొడుతుందే..??

ఈ మేకింగ్ వీడియోలో మీరు ఇది గమనించారా..ఏదో తేడా కొడుతుందే..??

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కొషియుం’ మూవీని తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రానా దగ్గుబాటి హీరోలుగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తోంది. ‘అయ్యప్పనుమ్ కొషియుం’ మూవీని తెలుగులో సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించనున్నారు.

‘అయ్యప్పనుమ్ కొషియుం’ ప్రాజెక్ట్‌ కు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ స్క్రీన్ ప్లే, డైలాగులు అందింస్తున్నారు. ఇక ఈ ఒక్క వార్త పవర్ స్టార్ అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. టాలీవుడ్‌కు బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన త్రివిక్రమ్.. కేవలం తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసమే ‘అయ్యప్పనుమ్ కొషియుం’ రీమేక్‌లో త్రివిక్రమ్ పనిచేస్తున్నారని టాక్.

ఈ మూవీ షూటింగ్ రీస్టార్ట్ అయిన‌ట్టు తెలుపుతూ ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ బీమ్లా నాయ‌క్ లుక్ కు అద్బుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. తాజాగా మేక‌ర్స్ మ‌రో స‌ర్ ప్రైజ్ వీడియోతో సినీ ల‌వ‌ర్స్ ముందుకొచ్చారు. తాజాగా మేకింగ్ గ్లింప్స్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. లొకేష‌న్ లో త్రివిక్ర‌మ్ రానాతో చ‌ర్చిస్తుండ‌టం, పోలీస్ అధికారి బీమ్లా నాయ‌క్ గెట‌ప్ లో ఉన్న ప‌వ‌న్ న‌డుచుకుంటూ వ‌స్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ఇక్కడ ఓ విషయం కొంచెం తేడా కొడుతున్నట్లు ఉంది.

మేకింగ్‌ వీడియోలో సీన్స్‌ చెబుతున్నది, చేయిస్తున్నది సాగర్‌ చంద్ర కాదు.. త్రివిక్రమ్‌ ఇక్కడే అందరికి డౌట్ వస్తుంది. స్క్రీన్‌ ప్లే, మాటల రచయిత అయితే సెట్స్‌లో ఉండొచ్చు అది ఓకే.. కానీ డైరక్షన్‌ చేయాల్సిన సమయంలో కూడా ఆయన అక్కడే ఉన్నారు..దీంతో ఈ విడీయో చూసిన ప్రతి ఒక్కరి ఈ సందేహం వస్తుంది. ఆసలు ఈ మూవీ కి డైరెక్టర్ సాగర్ కె. చంద్ర నా.. లేకా పేరు ఆయనది పెట్టి.. తెర వెనక మ్యాటర్ మొత్తం త్రివిక్రమ్‌ నే చూసుకుంటున్నారా..??అని సోషల్ మీడియా వేదికగా తమ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news