Moviesనాగ చైతన్య కు బ్రదర్ కానీ ఓ బ్రదర్ ఉన్నారు..ఆయన ఎవరో...

నాగ చైతన్య కు బ్రదర్ కానీ ఓ బ్రదర్ ఉన్నారు..ఆయన ఎవరో తెలుసా..??

టాలీవుడ్ లో లెజెండ్ హీరో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు గా వెండితెరకు పరిచయమైన నాగార్జున తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అయితే నాగార్జున సినిమా రంగంలో తిరుగులేని హీరోగా ఉన్నా వ్యక్తిగత జీవిత విషయంలో విషయానికొస్తే కాస్త ఇబ్బంది పడ్డారు. ఈయన పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరికీ తెలిసిందే. అక్కినేని అమల ఈయన రెండో భార్య.

మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాక ఈమెను పెళ్లి చేసుకున్నారు నాగార్జున. మొదట టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు గారి అమ్మాయి లక్ష్మీతో నాగార్జున వివాహం జరిగింది. వీరిద్దరి సంతానమే నాగ చైతన్య. వీరికి నాగచైతన్య పుట్టాక‌ మనస్పర్థలు తలెత్తాయి. అదే టైంలో నాగార్జున – అమల తో సినిమాలు చేస్తున్న క్రమంలో ప్రేమలో పడటం… చివరకు శ్రీలక్ష్మికి దూరమై విడాకులు ఇచ్చేసారు.

నాగార్జున నుంచి దగుపటి లక్ష్మీ విడిపోయిన తర్వాత చెన్నై లోని బిజినెస్ మాన్ శరత్ విజయరాఘవ ని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడింది.రెండవ పెళ్లి చేసుకున్న చైతు కి అన్ని విషయాల్లో అండగా ఉంటూ తనకు 18 ఏళ్ళు వచ్చేవరకు పెంచి పెద్ద చేసింది.కానీ లక్ష్మి రెండో భర్త గురించి గురించి దగ్గుబాటి కుటుంబంలోని వారు గాని లక్ష్మి కానీ బయట చెప్పుకున్న సందర్భాలు ఎక్కడా లేవు. ఇక దగ్గుపాటి లక్ష్మి వివాహం చేసుకున్న శరత్ విజయరాఘవ కు కూడా అప్పటికే పెళ్లి చేసుకున్నారు.

అయితే శరత్ మొదటి భార్య కొడుకు, నాగ చైతన్య ఇద్దరు ఒక ఇంట్లోనే పెరిగారంట. ఇక శరత్ కొడుకు బిజినెస్ మాన్ గా రాణిస్తున్నారు. అలాగే కొన్ని నెలల క్రితం శరత్ కుమారుడు వివాహం జరిగింది ఆ వివాహానికి నాగచైతన్య సమంత హాజరై వేడుకలో స్పెషల్ ఆట్రక్షన్ గా నిలిచారు. శరత్ కూడా ప్రముఖ పరిశ్రమలో సేల్స్ చీప్ ఎగ్జిక్యూటివ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నాగచైతన్య తల్లి లక్ష్మి, ఆవిడ రెండో భర్త శరత్ ఇద్దరు రెండో వివాహం చేసుకున్నా కానీ వారిద్దరికీ మొదటి వివాహ జీవితంలో పుట్టిన కుమారులను పెంచుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేశారు. అయితే ఈ జంటలు విడిపోయినా ఎవరి లైఫ్ వాళ్లు బాగానే సెటిల్ చేసుకున్నారు.. వాళ్ల కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news