Moviesకత్తి లాంటి ఫిగర్ ను పట్టిన స్టార్ డైరెక్టర్..బట్టలే వేసుకోదు..??

కత్తి లాంటి ఫిగర్ ను పట్టిన స్టార్ డైరెక్టర్..బట్టలే వేసుకోదు..??

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ హీరోగా వ‌చ్చిన‌ `భరత్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన కియారా.. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ వినయ విధేయ రామ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ చిత్రం త‌ర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కియారా న‌టించ‌లేదు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితం సాధించకపోవడంతో తిరిగి బాలీవుడ్‌‌‌కు చెక్కేసింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస అవ‌కాశాల‌తో ఛాన్సులు అందుకుంటూ.. స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అక్కడ ‘కబీర్ సింగ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఈ అమ్మడికి అక్కడ వరుస అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం ఈ చిన్నది బాలీవుడ్‌‌‌‌లో స్టార్ హీరోయిన్‌‌‌‌‌గా రాణిస్తోంది.

ఇదిలా ఉంటే.. జులై31..అంటే ఈ రోజు హాట్ బ్యూటీ కియారా అద్వానీ పుట్టినరోజు. పుట్టిన రోజు సంధర్భంగా అమె తదుపరి సినిమా వివారలు గురించి ఓ కొత్త అప్డేట్ లీకైంది. అదేమిటంటే..? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్‌సి 15” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం… శంకర్, రామ్ చరణ్ మూవీ దిల్ రాజు నిర్మించనున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా బర్త్‌డే విషెస్‌ తెలిపిన మూవీ టీం ఆమెను వెల్‌కం అబోర్డ్‌ అంటూ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఇక మరో విశేషం ఏంటంటే.. ఈ భారీ యాక్షన్ డ్రామాలో చరణ్ తో పాటు మరో స్టార్ హీరో కూడా నటించే అవకాశం ఉందని అంటున్నారు. అది మరెవరో కాదు కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్‌‌‌‌లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news